Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నమస్తే సర్, మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ, సిప్ మధ్య తేడా వివరించగలరు? వీటిలో ఎందులో ఇన్వెష్ట్ చేస్తే మంచిది అని చెప్పగలరు.

Asked by Kunuku vasu on
ఈక్విటీ అంటే షేర్ మార్కెట్ లో మదుపు చేసేది అని అర్ధం. ఇందులో నేరుగా షేర్ ఎంచుకోవచ్చు లేదా కాస్త రిస్క్ తగ్గించుకుని మ్యూచువల్ ఫండ్ ద్వారా కూడా మార్కెట్ లో మదుపు చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ మీ వీలు ప్రకారం మదుపు చేయవచ్చు లేదా నెల నెలా క్రమంగా సిప్ ద్వారా బ్యాంకు ఖాతా నుంచి ఫండ్ కి డబ్బులు చేరి మీకు యూనిట్స్ దక్కేలా కూడా చేయవచ్చు.  సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

మరిన్ని

మీ ప్రశ్న