close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share

నేను ఒక రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని, పెన్షన్ వస్తోంది. నేను స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తుంటాను. దీనికి స్వల్ప కాల, దీర్ఘకాల మూలధన పన్ను ఎలా ఉంటుంది?

Asked by P SURENDRA BABU on
షేర్స్ కొనిగోలు చేసి 12 నెలల లోపు షేర్లను స్టాక్ మార్కెట్లో అమ్మినప్పుడు స్వల్పకాలిక మూలధన లాభం/నష్టంగా పరిగణిస్తారు. మీరు నిర్వహించే లావాదేవీల్లో స్వల్పకాలిక లాభం వచ్చిన సందర్భాల్లో లాభం పై పన్ను 15 శాతం చెల్లించాల్సి ఉంటుంది.  షేర్స్ కొనిగోలు చేసి 12 నెలల తరవాత షేర్లను స్టాక్ మార్కెట్లో అమ్మినప్పుడు దీర్ఘకాలం మూలధన ఆదాయ పన్ను గా పరిగణిస్తారు. రూ. 1 లక్ష లాభం వరకు పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. ఆ పైన మాత్రం 10 శాతం పన్ను ఉంటుంది.  

మరిన్ని

మీ ప్రశ్న