Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నమస్తే ఈనాడు, నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఐటీ రికృటర్  గా పని చేస్తున్నాను. నెలకు 45,000 జీతం. ఎలాంటి సేవింగ్స్ లేవు. సొంత ఇల్లు నా కల. కానీ గారెంటి లేని జాబ్ వల్ల రిస్క్ చేయలేకపోతున్నాను. అమ్మ, నాన్న, భార్య, ఒక కొడుకు నేనే ఆధారం. మంచి సలహా ఇవ్వగలరు.

Asked by దేవేందర్ on
పొదుపు లేకుండా మీరు నేరుగా రుణం తీసుకుని ఇల్లు కొనడం వల్ల సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. మీరు కొన్నేళ్ల పాటు పొదుపు చేసి మిగిలిన మొత్తం తో రుణం తీసుకోవడం మేలు. మీ ఆదాయం లో 30 శాతానికి మించి రుణాలు ఉండకుండా చూసుకోండి. 30-33 శాతం వరకు పొదుపు చేయండి, మిగిలిన మొత్తం తో ఖర్చులని నిర్వహించండి. స్వల్ప కాలం కోసం అయితే బ్యాంకు రికరింగ్ డిపాజిట్ లో నెల నెలా మదుపు చేయవచ్చు. దీర్ఘకాల లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్స్ మేలు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

మరిన్ని

మీ ప్రశ్న