Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నేను నవంబర్, 2021 లో పదవీ విరమణ తీసుకోబోతున్నాను. సుమారుగా రూ. 1 కోటి వరకు పొందే అవకాశం ఉంటుంది. అందులో రూ. 30 లక్షల వరకు ఇంటి రుణం తీర్చడానికి, రూ. 15 లక్షలు పీఎంవీవీవై, మరో రూ. 15 లక్షలు పెద్దల పొదుపు పధకం, రూ. 9 లక్షల వరకు పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్, రూ. 10 లక్షలు బ్యాంకు డిపాజిట్ లో మదుపు చేద్దామని ఆలోచన. మిగిలిన రూ. 20 లక్షలతో ఎలాంటి పథకాల్లో మదుపు చేయాలో సూచించండి.  సురక్షితంగా ఉంటూ, ద్రవ్యోల్బణాన్ని మించే రాబడి అందించే పధకాలు సూచించండి.  

Asked by K.V.SATYANARAYANA on
మీరు ఎంచుకున్న పధకాలు మంచివే. అయితే, ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి పొందాలంటే మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. 5-6 నెలల పాటు లేదా మీ వీలు ని బట్టి కొంత మొత్తాన్ని మదుపు చేస్తూ ఉండడం మంచిది. కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేయగలిగితే మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా, సగటు రాబడి 10 నుంచి 12 శాతం వరకు ఉంటె అవకాశం ఉంది. ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

మరిన్ని

మీ ప్రశ్న