Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్ సిరి, నేను ఈ క్రింది ఫండ్స్ లో ప్రతి నెలా ౩,౦౦౦ సిప్ చేస్తున్నాను. ఈ పోర్ట్ ఫోలియో లో ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైతే సూచించగలరు. 1. ICICI Prudential Focused Bluechip Equity Fund - Growth 2. HDFC Mid-Cap Opportunities Fund - Regular Plan - Growth 3. DSP BlackRock Small/Micro Cap Fund - Regular Plan - Growth 4. Franklin India Smaller Companies Fund 5. Axis Long Term Equity Fund - Growth 6. Axis Multicap Fund 7. Aditya Birla Sun Life Frontline Equity Fund -Growth-Regular Plan 8. Aditya Birla Sun Life Tax Relief'96 Fund- Growth-Regular Plan 9. SBI Blue Chip Fund - Regular Plan - Growth 10. Aditya Birla Sun Life Pure Value Fund - Growth-Regular Plan 11. HDFC- Children gift fund

Asked by రవిశేఖర్ ఉప్పల on
మీరు అధిక ఫండ్స్ లో మదుపు చేస్తున్నారు. దీని వల్ల ప్రత్యేకమైన లాభం ఉండదు. పైగా, వీటిని ట్రాక్ చేయడం కష్టతరం అవుతుంది. మీ సిప్ మొత్తం రెండు ఫండ్స్ లో మదుపు చేయడం మేలు. ఒక లార్జ్ కాప్, ఒక మిడ్ కాప్ ఎంచుకోవచ్చు. ఎస్బీఐ స్మాల్ కాప్ ఫండ్, ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ ఎంచుకోవచ్చు. మార్కెట్ దిగువ లో ఉన్నప్పుడు కూడా కొంత మొత్తాన్ని మదుపు చేస్తూ ఉండండి. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. 

మరిన్ని

మీ ప్రశ్న