close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share

హలో సిరి, నేను సుమారుగా రూ. 22 లక్షల వరకు లార్జ్ కాప్, మిడ్ కాప్, టాక్స్ సేవర్, డెట్  ఫండ్స్ లో డిస్ట్రిబ్యూటర్ వెబ్సైటు ద్వారా మదుపు చేశాను. దీని వల్ల నాకు ఎంత నష్టం ఉంటుంది?  

Asked by KA Reddy on
మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతులుంటాయి. బ్రోకింగ్ కంపెనీలు, పంపిణీదారుల ద్వారా  ఆఫ్లైన్ పద్ధతి(లేదా వారి ఆన్లైన్ వెబ్సైటు ద్వారా అయినా)లో మ్యూచువల్ ఫండ్డ్ సలహాదారుని ద్వారా పెట్టుబడి చేయవచ్చు. దీన్ని రెగ్యులర్ ప్లాన్ అంటారు. ఇందులో పంపిణీదారులు కొంత కమీషన్ తీసుకుంటారు. ఇది ఫండ్ ని బట్టి 1-2 శాతం వరకు ఉండొచ్చు.    నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. మీరు మీ ఫండ్స్ ని డైరెక్ట్ ప్లన్స్ లోకి మార్చుకోవచ్చు. ముందుగా యూనిట్స్ అమ్మేసి, ఈ డైరెక్ట్ ప్లాన్ లో తిరిగి మదుపు చేయండి.

మరిన్ని

మీ ప్రశ్న