Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

డియర్ సిరి, నా వయసు 29. నా నెలసరి జీతం రూ. 65 వేలు, ఖర్చులు రూ. 25 వేలు. పొదుపు, బీమా కోసం సలహాలు ఇవ్వండి. నేను పెట్టుబడులు చేయదల్చుకోలేదు.

Asked by siva on
ముందుగా మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి.  మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.  ఆరోగ్య బీమా పాలసీ కూడా తీసుకోవడం చాలా మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి. మీరు మీ ఆర్ధిక లక్ష్యాల ప్రకారం పొదుపు చేయడం మంచిది. పొదుపు చేసిన మొత్తాన్ని బ్యాంకుల్లో ఉంచడం వల్ల ద్రవ్యోల్బణం కంటే తక్కువ రాబడి వస్తుంది. మీకు సురక్షితమైన పెట్టుబడి కావాలనుకుంటే బ్యాంకు రికరింగ్ డిపాజిట్ లేదా పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్ ఖాతా ఎంచుకోవచ్చు.

మరిన్ని

మీ ప్రశ్న