close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నేను రూ. 1000 చొప్పున ఆక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ టాక్స్ రిలీఫ్ 96  ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో మదుపు చేశాను. వీటి లాక్ ఇన్ జూన్ లో పూర్తవనుంది. వీటిని మరో 3 ఏళ్ళ కోసం పొడిగించవచ్చా లేదా డబ్బు వెనక్కి తీసుకోవాలా?

Asked by Ram Kumar on
ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో సిప్ చేయడం మంచి ఆలోచన కాదు. ప్రతి సిప్ కి 3 ఏళ్ళ లాక్ ఇన్ ఉంటుంది. కాబట్టి, మీరు ఇప్పుడు మీ పెట్టుబడి మొత్తం వెనక్కి తీసుకునే వీలుండదు. మొదటి సిప్ మాత్రమే తీసుకోగలరు. రెండవ సిప్ మొత్తం జులై అలా 3 ఏళ్ళ తరవాత మాత్రమే మీ పెట్టుబడి వెనక్కి తీసుకోవచ్చు. మీరు ఈఎల్ఎస్ఎస్ బదులు ఇండెక్స్ ఫండ్స్ లో మదుపు చేయండి, దీర్ఘకాలం లో మంచి రాబడి పొందవచ్చు. పన్ను మినహాయింపు కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్ లాంటివి ఎంచుకోవచ్చు. 

మరిన్ని

మీ ప్రశ్న