Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నేను ఎల్ఐసి లేదా ఏదైనా బీమా కంపెనీ నుంచి టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇందులో కోవిడ్, ప్రమాద మరణం, అనారోగ్యాలతో మరణం ఇలా అన్నిటికీ బీమా హామీ వస్తుందా? మైనర్ ని నామినీ చేయవచ్చా?     

Asked by Rajagopal on
టర్మ్ పాలసీ కోవిడ్, ప్రమాద మరణం, అనారోగ్యాలతో మరణం ఇలా అన్ని రకాల మరణాలను కవర్ చేస్తుంది. అయితే, పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. ముఖ్యంగా, అనారోగాలను కచ్చితంగా తెలపాలి. టర్మ్ పాలసీ లో మైనర్ ని నామినీగా చేర్చవచ్చు. అయితే, 18 ఏళ్ళ నిండే వరకు వారికి బీమా హామీ అందదు. కాబట్టి, మీరు ఒక 'అప్పోయింటీ' ని నియమించాల్సి ఉంటుంది.  నామినీ వయసు 18 ఏళ్ళ లోపు పాలసీదారుడు మరణిస్తే, బీమా హామీ మొత్తాన్ని అప్పోయింటీ తీసుకుని 18 ఏళ్ళ తరవాత నామినీ కి అందిస్తారు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.  

మరిన్ని

మీ ప్రశ్న