Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నా వయసు 69. నేను రూ. 1 కోటి బీమా హామీ తో జీవిత బీమా తీసుకోవాలి అనుకుంటున్నాను. సలహా ఇవ్వండి. 

Asked by P v chalapati Rao on
జీవిత బీమా అనేది కుటుంబం లో అధిక సంపాదన కలిగిన వారి పేరు మీద తీసుకోవాల్సి ఉంటుంది. వారికి ఏదైనా జరిగితే కుటుంబానికి (నామినీ కి) ఒకే సారి బీమా మొత్తం అందిస్తారు. మీరు ఉద్యోగస్తులు కాకపోతే జీవిత బీమా అవసరం లేదు. మీ కుటుంబం లో ఎవరైనా మీ మీద ఆధార పడితే తీసుకోవచ్చు. లేదా మీ కుటుంబం లో అధిక సంపాదన కలిగిన వారు టర్మ్ పాలసీ తీసుకోవచ్చు. వారు మిమ్మల్ని నామినీ పెట్టడం వల్ల మీకు రక్షణ ఉంటుంది.  టర్మ్ పాలసీ లో వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి.  మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. 

మరిన్ని

మీ ప్రశ్న