Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నా పెరు క్రిష్ణ, నా వయసు 27. నెను 2 సంవత్సరాల నుంచి ప్రతి నెల రూ. 7000 ELSS (axis long term equity direct, Aditya Birla sunlife tax relif 96 direct, mirae asset tax tax fund saver) లొ మదుపు చేస్తున్నాను. ఇప్పుడు రూ. 9000 కి పెంచి పొదుపు చేద్దాం అనుకుంటున్నాను. ఉన్నవాటిని కొనసాగించల లేదంటే వెరే వేరేది ఎంచుకోవాలా?

Asked by కృష్ణ కుమార్ on
పన్ను ఆదా ఫండ్స్ లో సిప్ చేయడం మంచి పధ్ధతి కాదు. ప్రతి సిప్ కి 3 ఏళ్ళ లాక్ ఇన్ ఉంటుంది. కాబట్టి, మీరు డబ్బులు తీసుకోవడం కాస్త తరం అవుతుంది. పన్ను ఆదా కోసం మీరు పీపీఎఫ్, ఎన్పీఎస్ లాంటివి కూడా ఎంచుకోవచ్చు.  దీర్ఘకాలం మదుపు కోసం సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

మరిన్ని

మీ ప్రశ్న