Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

మా నాన్న గారి వయసు 75, ఆయనకి రూ. 40 వేలు పింఛను వస్తుంది. వారికి రూ. 1 కోటి లేదా రూ. 50 లక్షల బీమా హామీ తో టర్మ్ పాలసీ తీసుకోవచ్చా? అలాగే, రూ. 5-10 లక్షల ఆరోగ్య బీమా తీసుకోవచ్చా? మా అమ్మ గారు నాన్న గారి మీద ఆధారపడి ఉన్నారు.

Asked by sri karra on
సాధారణంగా, 70 ఏళ్ళ పై బడిన వారికి టర్మ్ ప్లాన్ దొరకడం కష్టతరం అవుతుంది. చాలా వరకు కంపెనీ లు 60 ఏళ్ళ లోపు వయసు ఉన్న వారికి మాత్రమే టర్మ్ ప్లాన్ అందిస్తుంటారు.  ప్రీమియం కూడా వయసు తో పెరుగుతూ వస్తుంది. మీరు మాక్స్ లైఫ్, ఐసీఐసీఐ లాంటి కంపెనీ లను సంప్రదించవచ్చు. టర్మ్ ప్లాన్ బదులు కొంత మొత్తాన్ని ఫిక్సిడ్ డిపాజిట్ లేదా సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పధకం లో మదుపు చేసి, ఏదైనా నెలసరి మిగులు ఉన్నట్టయితే  రికరింగ్ డిపాజిట్ చేయవచ్చు. నామినీ కి ఈ మొత్తం ఉపయోగపడుతుంది.   ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం చాలా మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి. వయసు పరంగా ప్రీమియం కూడా కాస్త ఎక్కువగా ఉండవచ్చు.

మరిన్ని

మీ ప్రశ్న