Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నా వయసు 28 , నాకు రూ.25000 జీతం. నెల నెలా మ్యూచువల్ ఫండ్స్ లో రూ. 2500 మదుపు చేస్తున్నాను. నెను టర్మ్ ప్లాన్ తీసుకోడానికి సూచనలు ఇవ్వండి.

Asked by వినయ్ కుమర్ on
మీరు ఎంచుకునే టర్మ్ ప్లాన్ లో మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. అలాగే, ఇండెక్స్ ఫండ్స్ లో మదుపు చేయండి, దీని వల్ల కాస్త రిస్క్ తగ్గుతుంది.

మరిన్ని

మీ ప్రశ్న