Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

డియర్ సిరి, నేను ఈ మ్యూచువల్ ఫండ్స్ లో 5 ఏళ్లుగా సిప్ చేస్తున్నాను -  1. Axis long term equity fund 2.Franklin build india fund 3. Hdfc small cap fund 5.Sbi blue chip fund 5. Icici balanced advantage fund/Icici Next 50 index fund. మరో 5 ఏళ్ళ కోసం ఇవి మంచివేనా?   

Asked by K.Radhakrishna Reddy on
మీరు ఎంచుకున్న ఫండ్స్ లో ఈఎల్ఎస్ఎస్, స్మాల్ కాప్, లార్జ్ కాప్, బ్యాలన్సుడ్ ఇలా చాలా రకాల ఫండ్స్ ఉన్నాయి. అధిక ఫండ్స్ లో మదుపు చేయడం వల్ల మీకు అధిక రాబడి వస్తుందనేది అపోహ మాత్రమే. చాలా వరకు ఫండ్స్ అవే షేర్స్ లో మదుపు చేస్తుంటాయి, కొన్ని షేర్స్ మాత్రమే వేరుగా ఉంటాయి. మీరు ఒకటి లేదా రెండు ఫండ్స్ లో మాత్రమే మదుపు చేయండి. ఈఎల్ఎస్ఎస్ లో సిప్ చేయడం సరైన పధ్ధతి కాదు, ప్రతి సిప్ కి 3 ఏళ్ళ లాక్ ఇన్ ఉంటుంది. కాబట్టి, మీరు డబ్బులు వెనక్కి తీసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఐసీఐసీఐ నిఫ్టీ నెక్స్ట్ 50 లో మదుపు కొనసాగించవచ్చు. రిస్క్ తీసుకోగలిగితే హెచ్డీఎఫ్సీ స్మాల్ కాప్ ఫండ్ బదులు ఎస్బీఐ స్మాల్ కాప్ ఫండ్ ఎంచుకోండి. మిగతా ఫండ్స్ లో మొత్తాన్ని కూడా ఈ ఫండ్స్ లో బదిలీ చేసుకోవడం మంచిది.

మరిన్ని

మీ ప్రశ్న