close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

డియ‌ర్ సిరి, నేను ప్ర‌భుత్వ ఉద్యోగిని. నా స్థూల ఆదాయం రూ. 36,928, నిక‌ర ఆదాయం రూ. 31,660. సీపీఎస్‌కి రూ.3288, టీఎస్‌జీఎల్ఐ కింద రూ.1000, పీటీ కి రూ.200, జీఐఎస్ కి రూ. 30 డిడ‌క్ట్ అవుతున్నాయి. పీఎల్ఐ కి రూ.1000. ఎల్ఐసీకి రూ.4,600 చెల్లిస్తున్నాను. ఒక సంవ‌త్స‌రం వ‌య‌సు ఉన్న నా పాప కోసం రూ.1000 సుక‌న్య స‌మృద్ది యోజ‌న‌లో డిపాజిట్ చేయాల‌నుకుంటున్నాను. నేను వ‌డ్డీలేకుండా తీసుకున్న రుణం రూ.5.50 ల‌క్ష‌లు ఉంది. వ్య‌క్తిగ‌త రుణం తీసుకుని నా మొత్తం రుణాల‌ను చెల్లించాల‌నుకుంటున్నాను. నేను నా రుణాల‌ను తీర్చి ఇల్లు లేదా ప్లాట్‌ కొనుగోలు చేసేందుకు ఏమి చేయాలి?

Asked by Ansari on
ప్రారంభ రోజుల్లో పెట్టుబ‌డులు పెట్ట‌డం వ‌ల్ల కాపౌండ్ వ‌డ్డీని పొంద‌వ‌చ్చు. మీ వార్షిక ఆదాయానికి క‌నీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా ట‌ర్మ్ పాల‌సీని తీసుకోండి. మీకు 60 సంవ‌త్స‌రాలు వ‌చ్చే వ‌ర‌కు పాల‌సీని కొన‌సాగించండి. పాల‌సీలో వివ‌రాలు క‌చ్చితంగా ఉండేలా చూసుకోవాలి దీని ద్వారా భ‌విష్య‌త్తులో క్లెయిమ్ చేయాల్సి వ‌స్తే ఏ విధ‌మైన ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉంటాయి. దానికి సంబంధించిన వివిధ బీమా రైడ‌ర్ల‌ను తీసుకోండి. వ్య‌క్తిగ‌త రుణాలు, బ‌య‌టి రుణాల‌లో వ‌డ్డీ రేట్లు 13 నుంచి 16 శాతం ఉంటాయి. అందువ‌ల్ల వాటికి దూరంగా ఉండ‌డ‌మే మంచిది. మీ ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకుని నెల‌వారీ ఆదాయం నుంచి దఫ‌ద‌ఫాలుగా హ్యండ్‌లోను చెల్లించండి. ప్లాటుకు బ‌దులుగా ఇంటిని కొనుగోలు చేయ‌డం మంచిది. గృహ రుణాలు దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డులు, ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 24బీ కింద వ‌డ్డీని క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. మీ డిపార్టుమెంటు నుంచి గృహ రుణం తీసుకోండి. హ్యాండ్‌లోను చెల్లించిన త‌రువాత సుక‌న్య స‌మృద్ధి యోజ‌నకు ఎక్కువ మొత్తాన్ని కేటాయించండి.

మరిన్ని

మీ ప్రశ్న