Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

డియర్ సిరి నాకు 2 పాలసీలు వున్నాయి, ఎల్ఐసి జీవన్ ఉమంగ్ , ప్రీమియం రూ. 1,75000. ఇది 15 ఏళ్ళ టర్మ్ పాలసీ. మరొక పాలసీ మాక్స్ లైఫ్, అది కూడా 15 ఏళ్ళ టర్మ్ పాలసీ. ప్రీమియం రూ. 1 లక్ష . నాకు 42 ఏళ్ళు, ఈ రెండు సరిపోతాయా? లేక ఇంకా మదుపు చేయాలా? 

Asked by వెంకట నాగార్జున రావు on
టర్మ్ పాలసీ లో బీమా మొత్తం అనేది వార్షిక ఆదాయాన్ని బట్టి తీసుకోవాలి. వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకి, వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు ఉన్న వారు సుమారుగా రూ. 1 కోటి నుంచి 1.50 కోటి వరకు బీమా హామీ ఎంచుకోవడం మేలు. 60 ఏళ్ళ వయసు  వరకు పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.  మీరు పేర్కొన్నట్టుగా ఎల్ఐసి జీవన్ ఉమంగ్ ఒక టర్మ్ పాలసీ కాదు, అది హోల్ లైఫ్ ఎండోమెంట్ పధకం. ఇందులో బీమా హామీ, పెట్టుబడి కలిపి ఉంటాయి, కానీ బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ. దేన్నీ సరెండర్ చేయడం మేలు. ఎల్ఐసి వారిని సంప్రదించి  మీ వీలు ప్రకారం సరెండర్ చేయండి.మాక్స్ లైఫ్ టర్మ్ పాలసీ లో అదనంగా బీమా ఎంచుకోవచ్చు, లేదా రెన్యువల్ సమయం లో ఒకేసారి వార్షిక ఆదాయాన్ని బట్టి మరో మాక్స్ లైఫ్ టర్మ్ ప్లాన్ ఎంచుకోవచ్చు. 

మరిన్ని

మీ ప్రశ్న