Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

సర్. నా పేరు సత్యనారాయణ. నేను ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగిని. షేర్ మార్కెట్ లో ఆప్షన్ ట్రేడింగ్ లో 120000 వరకు నష్ట పోయాను. దీనిని నేను IT రిటర్న్స్ లో చూపించాలా,  వద్దా?

Asked by Satyanarayana on
ఒప్షన్స్ లో నష్టాలని ఆదాయ పన్ను రిటర్న్స్ లో ఐటీఆర్ 4 లో చూపించవచ్చు. దీన్ని వ్యాపార నిమిత్తం పొందిన ఆదాయంగా ఆదాయ పన్ను శాఖ వారు లెక్కిస్తారు. ఈ నష్టాన్ని లాభాలతో అడ్జస్ట్  చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఇలాంటి నష్టాలు తెలిపినప్పుడు ఆడిట్ కూడా చేయించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేయడం లో కొన్ని నియమ నిబంధనలు కూడా ఉన్నాయి. కాబట్టి, మీరు ఛార్టర్డ్ అకౌంటెంట్ లాంటి ఒక పన్ను సలహాదారుడ్ని సంప్రదించడం మంచిది. వారు మీకు వివరంగా తెలుపగలరు.  

మరిన్ని

మీ ప్రశ్న