Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నెను LIC జీవన్ ఉమంగ్ పధకం లొ సంవత్సరానికి రూ. 1 లక్ష ప్రీమియం 2 సంవత్సరాల నుంచి చెల్లిస్తున్నాను. ఇది మంచి పధకమా కాదా?

Asked by nagendra on
మీరు పేర్కొన్న పధకం హోల్ లైఫ్ ఎండోమెంట్ పధకం. ఇందులో బీమా హామీ, పెట్టుబడి కలిపి ఉంటాయి. అయితే, ఇలాంటి ఎండోమెంట్ పథకాల్లో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. మీరు కనీసం 3 ప్రీమియం లు చెల్లించాక ఈ పాలసీ ని సరెండర్ చేసి కొంత వరకు డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. ఈ విషయమై ఎల్ఐసి ఆఫీస్ ని సంప్రదించండి. జీవితం బీమా కోసం ఒక టర్మ్ పాలసీ ఎంచుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి.  మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.  పెట్టుబడి కోసం మీ ఆర్ధిక లక్ష్యాల ఆధారణగా పీపీఎఫ్, ఎన్పీఎస్ (పదవీ విరమణ నిధి కోసం) లాంటి సురక్షితమైన పధకాలు ఎంచుకోవచ్చు. కొంత రిస్క్ తీసుకోగలిగితే మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలం పాటు మదుపు చేసి మంచి రాబడి పొందొచ్చు. నెల నెలా కాబట్టి సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.  

మరిన్ని

మీ ప్రశ్న