Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నేను మా అబ్బాయి పేరు మీద ఎల్ఐసి జీవన్ ఉమంగ్ పాలసీ తీసుకున్నాను, 20 ఏళ్ళ కాల పరిమితి, రూ. 20 లక్షల బీమా హామీ, రూ.90 వేల వార్షిక ప్రీమియం. దీనితో పాటు హెచ్డీఎఫ్సీ టాప్ 50 ఫండ్ లో 2 ఏళ్లుగా నెలకి రూ. 3500 మదుపు చేస్తున్నాను. మరో రూ. 5000 మదుపు చేయడానికి సలహా ఇవ్వండి. 

Asked by Krishna v b on
మీరు పేర్కొన్న జీవన్ ఉమంగ్ పాలసీ ఒక ఎండోమెంట్ పధకం. ఇందులో బీమా హామీ, పెట్టుబడి కలిపి ఉంటాయి. అయితే, బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువ. ఇలాంటి పధకాల నుంచి దూరంగా ఉండడం మంచిది. వీలయితే ఎల్ఐసి ని సంప్రదించి పాలసీ సరెండర్ చేయండి. జీవిత బీమా అనేది కుటుంబ పెద్ద (అధికంగా సంపాదించే వ్యక్తి) పేరు మీద తీసుకోవడం మంచిది, వారికి ఏదైనా జరిగితే కుటుంబానికి ఆదాయాన్ని భర్తీ చేస్తుంది. మీరు తెలిపిన ఫండ్ పేరు ని బట్టి హెచ్డీఎఫ్సీ ఇండెక్స్ నిఫ్టీ 50 ఫండ్ లో మదుపు చేస్తున్నారని భావిస్తున్నాము. ఇందులో మీరు సిప్ కొనసాగించవచ్చు, అదనపు సిప్ మొత్తానికి కూడా ఇందులో మదుపు చేయవచ్చు. అయితే, నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.   

మరిన్ని

మీ ప్రశ్న