Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మల్టీ కాప్ ఫండ్ గురించి చెప్పండి. దీర్ఘకాలం కోసం ఇది తీసుకోవచ్చా?

Asked by Satya on
మీరు పేర్కొన్న ఫండ్ ఎన్ఎఫ్ఓ ద్వారా గత నెల మార్కెట్ లోకి ప్రవేశ పెట్టారు. కనీసం 3-5 ఏళ్ళు గడిస్తే తప్ప ఫండ్ పని తీరు ని అంచనా వేయడం సాధ్యం కాదు. మీరు మార్కెట్ లో ఇప్పటికీ ఉన్న ఫండ్స్ లో మదుపు చేయడం మేలు. మల్టీ కాప్ ఫండ్స్ లో అధిక రిస్క్ ఉంటుంది. దీని బదులు ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. సిప్ ద్వారా నెల నెలా ఇందులో మదుపు చేయండి, మార్కెట్ దిగువ లో ఉన్నప్పుడు కూడా కొంత మదుపు చేస్తూ ఉండడం మంచిది.   నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

మరిన్ని

మీ ప్రశ్న