Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

షేర్ మార్కెట్ గురించి నాకు సరైన అవగాహన లేదు. కొంచెం వివరించగలరు. నెను నెలకు రూ. 10,000 వరకు ఆదా చేయగలను. అధిక ఆదాయం వచ్చే సురక్షిత మార్గాలను సుచించండి.

Asked by Koneti Muralidhar on
షేర్ మార్కెట్ లో అధిక రిస్క్ ఉంటుంది. దీనికి సమయం, నైపుణ్యం ఎంతో అవసరం. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పరోక్షంగా కాస్త తక్కువ రిస్క్ తో నెల నెలా పెట్టుబడి పెట్టగలరు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. రిస్క్ లేని పధకాల కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్ (పదవీ విరమణ నిధి కోసం) లాంటి వాటిని ఎంచుకోవచ్చు. ఇవి దీర్ఘకాలం లో మంచి రాబడి అందిస్తాయి.

మరిన్ని

మీ ప్రశ్న