Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

సర్, నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని, 4 ఏళ్ళ క్రితం ఉద్యోగం లో చేరాను. దీర్ఘకాలం కోసం పీపీఎఫ్ లో ఎంత మదుపు చేస్తే ఎక్కువ లాభం ఉంటుంది?

Asked by Arun Kumar on
పెట్టుబడులు అనేవి దీర్ఘ, స్వల్ప కాల లక్ష్యాల ఆధారంగా చేసుకోవడం మంచిది. ముందుగా మీరు జీవిత బీమా తీసుకోండి, ఆరోగ్య బీమా కూడా ఉండడం మంచిది. తరువాత మీ లక్ష్యాలను ఎంచుకుని వాటి కోసం ఎంత మదుపు చేయాలో నిర్ణయించుకోవచ్చు. పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ లో కొంత మొత్తాన్ని మదుపు చేయవచ్చు. మీరు పీపీఎఫ్ లో 15 ఏళ్ళ పాటు నెల కి రూ. 10 వేలు మదుపు చేస్తే  సుమారుగా రూ. 32 లక్షల వరకు పొందే వీలుంటుంది. అదే మొత్తం మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తే రూ. 50 లక్షల వరకు పొందగలరు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు.  నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

మరిన్ని

మీ ప్రశ్న