Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నేను మా పెద్ద అబ్బాయి కోసం కోమల్ జీవన్ పాలసీ లో రూ. 5 లక్షల బీమా హామీ కోసం రూ. 37 వేలు ప్రీమియం చెల్లిస్తున్నాను. అలాగే, చిన్నబ్బాయి కోసం జీవన్ తరుణ్ పాలసీ లో రూ. 5 లక్షల బీమా హామీ కోసం రూ. 23 వేలు చెల్లిస్తున్నాను. ఇందులో ఏది బాగుంది? ఒకటి తీసేసి వేరే పాలసీ తీసుకోమంటారా?

Asked by Parasaram Srinivas on
పిల్లల కోసం ఉండే ప్రత్యేక బీమా పాలసీ లలో పెద్దగా ప్రత్యేకతలు ఉండవు. మీరు పేర్కొన్న పాలసీ లు మనీ బ్యాక్ పాలసీలు. వీటిలో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. జీవిత బీమా పాలసీ అనేది మీ పేరు మీద తీసుకున్నట్లయితే మీకు ఏదైనా జరిగితే పెద్ద మొత్తం లో బీమా హామీ అందడం వల్ల కుటుంబానికి అండగా ఉంటుంది.  ముందుగా మీరు మీ పేరు మీద ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి.  మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.   పిల్లల చదువు కోసం అనేక పెట్టుబడులు ఉన్నాయి. ఆడపిల్ల కోసం సుకన్య సమృద్ధి యోజన ప్రత్యేకంగా ఉంది. లేదంటే పీపీఎఫ్ కూడా ఎంచుకోవచ్చు. వీటితో పాటు కొంత వరకు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే దీర్ఘకాలం లో మీరు మంచి నిధి సమకూర్చుకోవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. 

మరిన్ని

మీ ప్రశ్న