Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

సర్, నా కూతురుకి 5 ఏళ్ళు. పొదుపు కోసం సుకన్య సమృద్ధి యోజన మంచిదేనా?

Asked by Jalli eswar on
ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన ఒక ప్రత్యేక పధకం. ఈ పధకం వారి ఉన్నత విద్య లేదా పెళ్లి కోసం పెద్ద మొత్తాన్ని సమకూర్చుకునే అవకాశం కల్పిస్తుంది. మీరు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లో ఈ పధకం లో మదుపు చేయవచ్చు.  దీనితో పాటు మీరు మీ పేరు మీద ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి.  మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.  

మరిన్ని

మీ ప్రశ్న