Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్ సిరి, నా పేరు మల్లిక్. నా దగ్గర రూ. 1 లక్ష ఉన్నాయి, వాటిని ఎక్కడ మదుపు చేయాలి, ఒక రూ. 50000 మ్యూచువల్ ఫండ్స్ లో లంప్సమ్ మరియు ఇంకో రూ. 50000 పోస్ట్ ఆఫీస్ పధకం లో పెట్టడం మంచిదేనా? మంచిది అయితే లంప్సమ్ కోసం మంచి  ఫండ్ తెలియచేయగలరు.  

Asked by Mallik on
మ్యూచువల్ ఫండ్, పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్ లో మదుపు చేయడం మంచి ఆలోచనే. అయితే, మ్యూచువల్ ఫండ్ లో ఒకేసారి మదుపు చేసే బదులు 6 నెలల పాటు నెలకి రూ. 8 వేల చొప్పున మదుపు చేయడం మంచిది. దీనితో పాటు నెల నెలా సిప్ కూడా చేయండి. సిప్ లేదా లంప్సమ్ కోసం ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు.  నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

మరిన్ని

మీ ప్రశ్న