Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్, నేను మా పాప కోసం రూ. 1.50 లక్షలు ఎస్బీఐ స్మార్ట్ స్కాలర్ మ్యూచువల్ ఫండ్ లో మదుపు చేశాను. ఇది 3 ఏళ్ళు పూర్తయింది. దీన్ని కొనసాగించాలా వద్దా? మ్యూచువల్ ఫండ్స్ గురించి నాకు అవగాహనా లేదు.  

Asked by Manikumar on
ఎస్బీఐ స్మార్ట్ స్కాలర్ ఒక యూలిప్. బీమా పాలసీలలో ఇదొక రకం. వీటిలో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. ఇందులో పాలసీ సరెండర్ చేయడానికి 5 ఏళ్ళ పాటు పాలసీ ప్రీమియం కట్టి ఉండాలి. ఒకవేళ ఈ లోపు సరెండర్ చేయాలనుకుంటే వారు పాలసీ ని క్లోజ్ చేసి 5 ఏళ్ళ కాలపరిమితి పూర్తయ్యే వరకు ఇప్పటి వరకు మీరు చేసిన పెట్టుబడి మీద 4 శాతం చొప్పున వడ్డీ అందిస్తారు. మరిన్ని వివరాల కోసం మీ ఏజెంట్ లేదా ఎస్బీఐ బ్రాంచీ ని సంప్రదించండి. జీవిత బీమా కోసం మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి.  మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.  పెట్టుబడి కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్(పదవీ విరమణ నిధి కోసం) లాంటి పధకాలు ఎంచుకోవచ్చు. దీర్ఘకాలం కోసం కొంత రిస్క్ తీసుకోగలిగితే మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడం మంచిది. కనీసం 10 ఏళ్ళ పాటు  మదుపు చేయాలనుకుంటే   సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ డైరెక్ట్ ఫండ్ ఎంచుకోవచ్చు.

మరిన్ని

మీ ప్రశ్న