Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్ సిరి, నా పేరు మల్లిక్. నాకు 80c లో రూ. 1.50 లక్షల పరిమితి దాటింది. అది కాకుండా అదనంగా పన్ను ఆదా కోసం NPS లో మదుపు చేద్దాం అనుకుంటున్నా. కానీ, NPS లో  ఖాతా తెరిచే ముందు ఆక్టివ్ ఛాయస్/ఆటో ఛాయస్ లో ఏది ఎంచుకోవాలి? పన్ను ఆదా కోసం NPS లో మదుపు చేయడం మంచిదేనా? ఒకసారి ఎంచుకున్నాక మళ్ళీ మార్చుకునే అవకాశం ఉంటుందా?  

Asked by Mallik on
అదనపు పన్ను మినహాయింపు కోసం ఎన్పీఎస్ లో మదుపు చేయడం మంచిదే. ఇందులో మీ ఫండ్ నిర్వహణ విషయం లో రెండు ఆప్షన్స్ ఉంటాయి - ఆటో ఛాయస్, ఆక్టివ్ ఛాయస్. ఆటో ఛాయస్ ఎంచుకున్నట్టయితే మీ వయసు ఆధారంగా ఈక్విటీ, డెట్ లో మదుపు చేస్తారు. వయసు పెరిగే కొద్దీ ఇది మారుతూ ఉంటుంది. ఆక్టివ్ ఛాయస్ లో మీరే ఈక్విటీ, డెట్ లో ఎంత మొత్తం మదుపు చేయాలన్నది నిర్ణయించుకోవచ్చు. మీరు ముందుగా ఆటో ఛాయస్ ఎంచుకోవడం  మంచిది. కొన్నాళ్ల తరవాత మీకు అవగాహనా వస్తుంది. అప్పుడు మీ వీలు ని బట్టి మార్చుకోవచ్చు. 

మరిన్ని

మీ ప్రశ్న