Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

సర్, నా దగ్గర రూ. 10 లక్షలు ఉన్నాయి. ఎందులో పెట్టుబడి పెడితే ఏడాదికి 15-20 శాతం లాభం వస్తుంది? చెప్పగలరు.

Asked by మల్లారెడ్డి on
మీరు పెట్టుబడి కాల పరిమితి తెలుపలేదు. స్వల్ప కాలం కోసం అయితే, సురక్షితమైన పెట్టుబడి మార్గాలు ఎంచుకోవడం మేలు. బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్ ఎంచుకోవచ్చు. ఇందులో మీరు 5-6 శాతం వరకు రాబడి పొందగలరు. దీర్ఘకాలం కోసం, అంటే కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేయగలిగితే, కొంత రిస్క్ తో ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయవచ్చు. ఇందులో మీకు సగటుగా 10 నుంచి 12 శాతం వరకు రాబడి పొందే అవకాశం ఉంటుంది. అధిక రాబడి కోసం మరింత రిస్క్ తీసుకోవచ్చు. దీనికోసం ఒక మిడ్/స్మాల్ కాప్ ఫండ్ మేలు. ఇండెక్స్ ఫండ్ లో యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. మిడ్/స్మాల్ కాప్ కోసం ఎస్బీఐ స్మాల్ కాప్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

మరిన్ని

మీ ప్రశ్న