Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్ నా పేరు సునీల్. మా అబ్బాయి చదువు కోసం జీవన్ తరుణ్ పాలసీ తీసుకోవడం మంచిదేనా?

Asked by Nagasunil on
బీమా కంపెనీ లు పిల్లల పేరు తో అనేక పధకాలు అందిస్తుంటారు. అయితే, వీటిలో పేరు తప్ప వేరే ప్రత్యేకతలు ఉండవు. మీరు తెలిపిన పాలసీ ఒక మనీ బ్యాక్ ప్లాన్. ఇలాంటి పాలసీలలో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువ. వీటి నుంచి దూరంగా ఉండడం మేలు. జీవిత బీమా కోసం ముందు మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి.  మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.   పెట్టుబడి కోసం పీపీఎఫ్ ఎంచుకోవచ్చు. కొంత రిస్క్ తీసుకోగలిగితే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎంచుకోవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

మరిన్ని

మీ ప్రశ్న