Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్, నా పేరు సన్యాసిరావు. జీవిత బీమా పాలసీలలో ఏది ఉత్తమ మైనదో దయచేసి వయస్సుల వారిగా తెలియజేయగలరు. నమస్తే.

Asked by తంగి సన్యాసి రావు on
వీలైనంత చిన్న వయసు లో జీవిత బీమా పాలసీ తీసుకోవడం మంచిది. దీని వల్ల పాలసీ దారుడికి ఏదైనా జరిగితే కుటుంబానికి ఒకేసారి బీమా హామీ మొత్తాన్ని అందిస్తారు. పెట్టుబడి కోసం బీమా పాలసీలు తీసుకోవడం మంచిది కాదు. బీమా పాలసీలలో అనేక రకాలు ఉంటాయి. ఉదాహరణకి, ఎండోమెంట్, మనీ బ్యాక్, హోల్ లైఫ్, టర్మ్ ఇలా చాల రకాల పాలసీ లు అందుబాటులో ఉన్నాయి. జీవిత బీమా కోసం టర్మ్ పాలసీ మాత్రమే మేలు. ఇందులో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. ఇతర పాలసీలలో బీమా హామీ, పెట్టుబడి కలిపి ఉంటాయి. అయితే, బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువ. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి.  మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. 

మరిన్ని

మీ ప్రశ్న