Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

టాప్ అప్ ఇంటి రుణానికి పన్ను మినహాయింపు ఉంటుందా?  

Asked by k.vidyasagar on
సాధారణంగా, ఇంటి రుణం తీసుకున్న వారు రుణం తీరుస్తుండంగా ఇంటి మరమ్మతుల కోసం లేదా అదే ఇంట్లో ఏదైనా అదనపు గదులు లాంటివి నిర్మించడానికి టాప్ అప్ రుణం తీసుకుంటారు. దీనికి కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, ఇంటి రుణం లో లాగా రూ. 2 లక్షల వరకు వడ్డీ మినహాయింపు ఉండదు. టాప్ అప్ రుణం వడ్డీ పై రూ. 30 వేల వరకు మినహాయింపు ఉంటుంది. అయితే, ఇది కూడా రూ. 2 లక్షల్లో భాగమే. ఉదాహరణకి, మీరు మరమ్మతులకు సంబంధించి రూ. 10 లక్షలు రుణం తీసుకున్నారనుకుందాం. దీనికై ఏడాదికి రూ. 1 లక్ష  వడ్డీ చెల్లిస్తే, దాని పై రూ. 30 వేల వరకు మాత్రమే మినహాయింపు పొందొచ్చు. మిగతా 1.70 లక్షలు (రూ. 2 లక్షలు - రూ. 30,000) ఇంటి రుణం పై వడ్డీ మినహాయింపు పొందొచ్చు. అద్దె ఇంటికి సంబంధించినట్టైతే, రూ. 30 వేల పరిమితి వర్తించదు.

మరిన్ని

మీ ప్రశ్న