Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్, నా పేరు వేధంష్. బయసు 38.  5 ఏళ్ళ కోసం ఆక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, ఐసీఐసీఐ పృ లాంగ్ టర్మ్ ఈక్విటీ, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లిక్విడ్, నిప్పాన్ ఇండియా లార్జ్ కాప్ ఫండ్స్ లో సిప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మంచిదేనా? 

Asked by Vedansh on
మీరు మదుపు చేసిన ఫండ్స్  లో ఆక్సిస్, ఐసీఐసీఐ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్. ఇందులో లాక్ ఇన్ ఉంటుంది, ప్రతి సిప్ కి 3 ఏళ్ళ లాక్ ఇన్ వర్తిస్తుంది. కాబట్టి మీ పూర్తి డబ్బులు వెనక్కి తీసుకోడానికి 6 ఏళ్ళు పడుతుంది. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ పని తీరు అంతగా బాలేదు. పన్ను మినహాయింపుల కోసం మీరు పీపీఎఫ్, ఎన్పీస్ లాంటివి ఎంచుకోవచ్చు. లిక్విడ్ ఫండ్స్ అనేవి పెద్ద మొత్తం డబ్బు ఒకేసారి మదుపు చేయడానికి ఉపయోగ పడతాయి. దీని బదులు 2-3 ఏళ్ళ కోసం మీరు బ్యాంకు రికరింగ్/ఫిక్సిడ్ డిపాజిట్ కూడా ఎంచుకోవచ్చు. నిప్పాన్ ఇండియా లార్జ్ కాప్ ఫండ్ లో పెట్టుబడి కొనసాగించవచ్చు. ఇతర ఫండ్స్ లో  మొత్తాన్ని ఇందులో మదుపు చేయండి, లాక్ ఇన్ పూర్తయ్యాక సిప్ ఆపేయవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

మరిన్ని

మీ ప్రశ్న