Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నా పేరు కిశొర్. నాకు నెలకు రూ.ఒక లక్ష జీతం. నేను ఒక కొటి రూపాయల టర్మ్ పాలసీ తీసుకున్నాను, 3 లక్షల బీమా కూడా తీసుకున్నాను. మా అబ్బాయి కొసం 2 లక్షల చైల్డ్ పాలసీ తీసుకున్నాను. PPF లో రూ. 1.5 లక్షలు కడుతున్నాను. ఇంటి రుణం ఇంకా రూ. 5 లక్షలు కట్టాలి. నాకు ఇద్దరు అబ్బాయిలు. ఇంకా ఎమైనా పొదుపు చేయాలా?

Asked by కిషోర్ on
టర్మ్ పాలసీ కూడా జీవిత బీమా పాలసీ. ఇందులో పెట్టుబడులు ఉండవు, ప్రీమియం తక్కువాగా ఉంటుంది. పెట్టుబడి, బీమా కలిపి ఉన్న ఇతర బీమా పాలసీ లు సరెండర్ చేయడం మేలు. పిల్లల కోసం ప్రత్యేక పాలసీలు లేవు, మార్కెట్ లో ఉన్నవి మనీ బ్యాక్, ఎండోమెంట్ పథకాలే. ఏదైనా ఉన్నా, పేరు లో తప్ప వాటిలో వేరే ప్రత్యేకల ఉండవు. వీటి బదులు మీరు మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడం మేలు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

మరిన్ని

మీ ప్రశ్న