Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నా పేరు నాగేశ్వరరావు.మీరు ఇచ్చే జవాబులు చాలా బాగుంటాయి. నా ప్రశ్న ఏమనగా, నేను మ్యూచువల్ ఫండ్స్ లో రూ. 4000 సిప్ ద్వారా మదుపు చేస్తున్నాను. దాదాపు 3 ఏళ్ళు అయిపోయాయి. నా పోర్ట్ఫోలియో లో 1.DSP Midcap Fund-Reg(G),2.ICICI Pru Bluechip Fund(G),3.Kotak Flexicap Fund(G) ఉన్నాయి. వీటి పనితీరు ఎలా ఉన్నాయి? దయచేసి తెలుపగలరు. ధన్యవాదాలు.

Asked by Nageswara Rao K on
మీరు ఎంచుకున్న ఫండ్స్ లో ఒకటి లార్జ్ కాప్, ఒకటి మిడ్ కాప్, ఒకటి ఫ్లెక్సీ కాప్ ఫండ్. డీఎస్పీ మిడ్ కాప్ ఫండ్, ఐసీఐసీఐ పృ బ్లూ చిప్ ఫండ్ పని తీరు పరవాలేదు. కోటక్ ఫ్లెక్సీ కాప్ ఫండ్ పని తీరు అంతగా బాలేదు. అధిక ఫండ్స్ లో మదుపు చేయడం వల్ల అధిక రాబడి వస్తుంది అనేది ఒక అపోహ మాత్రమే. పైగా, మిడ్ కాప్, ఫ్లెక్సీ కాప్ ఫండ్స్ లో రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు ఐసీఐసీఐ ఫండ్ లో కొనసాగవచ్చు. మిగతా ఫండ్స్ లో సిప్ ఆపేసి అందులోని మొత్తాన్ని ఐసీఐసీఐ ఫండ్ లో మదుపు చేయవచ్చు. కొన్నాళ్ళకి మీరు మరి కాస్త రిస్క్ తీసుకోవాలనుకుంటే ఎస్బీఐ స్మాల్ కాప్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

మరిన్ని

మీ ప్రశ్న