Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్, నేను రూ. 1 లక్ష ఒకేసారి క్వాంటమ్, మీరే, డీఎస్పీ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో మదుపు చేశాను. దీర్ఘకాలం కోసం వేరే ఏదైనా ఫండ్స్ తెలుపగలరు.

Asked by Hari on
ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో ప్రత్యేక పెట్టుబడి వ్యూహం ఉండదు. వీటి పని తీరు గత కొద్ది ఏళ్లుగా అంతగా బాలేదు. మీరు ఎంచుకున్న ఫండ్స్ లోని మూడింట్లో మిరే అసెట్ ఫండ్ పని తీరు బానే ఉంది. పన్ను మినహాయింపు కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్ లాంటి పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో మదుపు చేయాలనుకుంటే మీరే ఫండ్ లో కొనసాగవచ్చు. దీనితో పాటు దీర్ఘకాలం కోసం ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. అధిక ఫండ్స్ లో మదుపు చేయడం వల్ల మీకు ట్రాక్ చేయడం కూడా కష్టతరం అవుతుంది. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. 

మరిన్ని

మీ ప్రశ్న