Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్ సర్, నా పేరు ప్రమోద్, వయసు 31. నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని. జీతం తో పాటు బీమా హామీ పెరిగే టర్మ్ ప్లాన్ మంచిదా? లేక అదనపు బీమా అవసరం ఉన్నప్పుడు భవిష్యత్తు లో మరో పాలసీ తీసుకోవడం మంచిదా? అలాగే, తీవ్ర అనారోగ్యానికి కూడా పాలసీ తీసుకోవచ్చా? 

Asked by Pramod on
బీమా హామీ పెరుగుతూ ఉండే పాలసీ లు మార్కెట్ లో అందుబాటు లో ఉన్నాయి. ఏడాదికి 5-10 శాతం వరకు పెంచుకునే వీలుంటుంది. అయితే, కొన్ని కంపెనీ లు మాత్రమే ఇలాంటి పాలసీలు అందిస్తున్నాయి. వీటి ప్రీమియం కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. వీటి బదులు మీకు ఎప్పుడైతే అధిక బీమా అవసరం ఉంటుందో అప్పుడు మరి పాలసీ తీసుకోవచ్చు. పాలసీ ఎంచుకునేటప్పుడు క్లెయిమ్ సెటిల్మెంట్ చూడడం మేలు.  వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి.  మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. క్లెయిమ్ సెటిల్మెంట్ పరంగా మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.

మరిన్ని

మీ ప్రశ్న