Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్, నేను ఇటీవలే రూ. 68 లక్షల ఇంటి రుణం తీసుకున్నాను, వడ్డీ 6.95 శాతం, కాల పరిమితి 30 ఏళ్ళు. ఇందులో రూ. 15 లక్షల వరకు రుణం ముందస్తుగానే తీర్చయడం మేలా లేక 10 ఏళ్ళ కోసం  మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడం మేలా? పన్ను మినహాయింపు, పెట్టుబడి కోణం లో కూడా తెలుపండి.

Asked by Sudheer on
 ఇంటి రుణం లో మొదటి కొన్నేళ్లలో వడ్డీ మొత్తం ఎక్కువ ఉంటుంది. కొన్నేళ్ళకి వడ్డీ తగ్గి, అసలు మొత్తం పెరుగుతుంది. కాబట్టి మొదట్లో మీరు కొంత మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే వడ్డీ భారం తగ్గే అవకాశం ఉంటుంది. కొందరు నిపుణులు ఇదే మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయమని సలహా ఇస్తుంటారు. మీకు మ్యూచువల్ ఫండ్స్ మీద అవగాహన ఉంది, కొంత రిస్క్ తీసుకోగలిగితే దీర్ఘకాలం పాటు మదుపు చేస్తే రాబడి తో కూడా రుణం చెల్లించవచ్చు. అయితే, ఇందులో ఒకోసారి నష్టాలూ రావచ్చు. కాబట్టి, మీ రిస్క్ పరిమితి ని బట్టి నిర్ణయం తీసుకోవడం మేలు. మ్యూచువల్ ఫండ్స్ లో ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయవచ్చు. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవచ్చు. పన్ను పరంగా ఇంటి రుణం చాల ఉపయోగకరంగా ఉంటుంది. సెక్షన్ 24 కింద రూ. 2 లక్షల వరకు వడ్డీ పై మినహాయింపు ఉంటుంది. కాబట్టి, మీరు ఎంత వరకు ఇంటి రుణం కట్టాలన్నది పన్ను మినహాయింపు, రిస్క్ పరిమితి ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చు. 

మరిన్ని

మీ ప్రశ్న