Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నేను LIC లో ఒక పాలసీ చేశాను, ఏడాది ప్రీమియం రూ. 18800 కట్టాలి. ఇది మూడు లక్షల పాలసీ.15 ఏళ్ళు కడితే 21 ఏళ్ళకి రూ. 6 లక్షలు వస్తుంది అన్నారు. కానీ కరోనా వలన నేను 3 ఏళ్ళు కట్టి వదిలేసాను .ఇప్పుడు నాకు డబ్బు అవసరం చాలానే ఉంది. నేను కట్టిన అసలు మొత్తం అయినా నాకు వస్తుందా? వస్తే ఎప్పుడు తీసుకోవచ్చు? వడ్డీ ఏమైనా ఇస్తారా? 

Asked by chandra mohan on
మీరు పాలసీ పేరు తెలుపలేదు కాబట్టి మేము సరైన వివరాలు అందించలేకపోవచ్చు. సాధారణంగా, వీటిలో కనీసం 3 ఏళ్ళ పాటు ప్రీమియం చెల్లిస్తే మొదటి ఏడాది ప్రీమియం మినహాయించి మిగతా రెండింట్లో 30 శాతం వరకు వెనక్కి తీసుకునే వీలుంటుంది. మీరు పాలసీ తీసుకున్న ఎల్ఐసి బ్రాంచీ ని సంప్రదించి సరైన వివరాలు తెలుసుకోవచ్చు. కొంత నష్టపోయినా సరెండర్ చేయడం మేలు. వీలు కాకపోతే పేడ్ అప్ (ప్రీమియం కట్టకుండా పాలసీ చివరి వరకు ఉంచడం) కూడా చేసుకోవచ్చు.  ఇలాంటి ఎండోమెంట్, హోల్ లైఫ్ పాలసీ లలో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువగానే ఉంటుంది. వీటి నుంచి దూరంగా ఉండడం మేలు. జీవిత బీమా కోసం టర్మ్ ప్లాన్ తీసుకుని పెట్టుబడి కోసం మీ రిస్క్ పరిమితి ఆధారంగా పీపీఎఫ్, ఎన్పీఎస్, మ్యూచువల్ ఫండ్స్ లాంటివి ఎంచుకోవచ్చు.

మరిన్ని

మీ ప్రశ్న