Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

సర్, షేర్ మార్కెట్ లో పెట్టుబడి కోసం మంచి సెక్టార్ సూచించండి.

Asked by K Ganesh on
షేర్ మార్కెట్ లో కచ్చితంగా ఒకే సెక్టార్ బాగుంటుంది అని చెప్పలేము. మార్కెట్ సైకిల్ లో ఒకోసారి కొన్ని కొన్ని సెక్టార్ లు బాగుండచ్చు, కొన్ని బాగోకపోవచ్చు. ఉదాహరణకి, కోవిడ్  సమయం లో ఫార్మా రంగం షేర్ లు చాలా వరకు లాభాలు గణించాయి. ఒకే సెక్టార్ లేదా కంపెనీ మీద ఆధార పడటం రిస్క్ తో కూడుకున్న పని. దీని కోసం మీరు బ్రోకరేజ్ లు లేదా షేర్ మార్కెట్ నిపుణుల్ని సలహా అడగవచ్చు.  మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పరోక్షంగా కూడా షేర్ మార్కెట్ లో మదుపు చేయవచ్చు. ఒక ఫండ్ అనేక సెక్టార్స్ లోని అనేక షేర్స్ లో మదుపు చేస్తుంటుంది. కాబట్టి, ఇందులో రిస్క్ కాస్త తక్కువగా ఉంటుంది.   సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

మరిన్ని

మీ ప్రశ్న