close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

సర్, నేను ఎస్బీఐ, ఎల్ఐసి ఇంటి రుణం చెల్లిస్తున్నాను. వీటి పై నాకు బీమా లేదు. బీమా తీసుకునే వీలుంటుందా?

Asked by SYED ILLIAS on
ఇంటి రుణానికి కూడా బీమా తీసుకునే సౌకర్యం ఉంటుంది. సాధారణంగా, రుణం తీసుకునే సమయం లో బ్యాంకు ద్వారా మీరు ఇది తీసుకోవచ్చు. చాలా వరకు బ్యాంకులు ప్రీమియం మొత్తాన్ని ముందస్తుగా ఒకేసారి చెల్లించమని కోరతారు. మీరు ఇప్పుడు వేరే బీమా కంపెనీల ద్వారా కూడా ఈ బీమా ని తీసుకోవచ్చు. రుణ మొత్తం, మీ వయసు, రుణం కాల పరిమితి ఆధారంగా ప్రీమియం ఉంటుంది.  దీని బదులు మీరు టర్మ్ ప్లాన్ కూడా తీసుకోవచ్చు. జీవిత బీమా లో భాగంగా రుణ మొత్తాన్ని కూడా జొధించినట్టైతే మీకు ఏదైనా జరిగినప్పుడు అధిక బీమా పొందొచ్చు . టర్మ్ ప్లాన్ లో మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి.  మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. 

మరిన్ని

మీ ప్రశ్న