Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

షేర్ మార్కెట్ లో మదుపు చేయడానికి సలహా ఇవ్వగలరు.  

Asked by Sai Krishna Gudoori on
షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే ముందు వాటి గురించి అవగాహన తెచ్చుకోవడం మంచిది. దీని గురించి తెలుసుకునేందుకు చాలా  పుస్తకాలు,వెబ్సైట్లు  అందుబాటులో ఉన్నాయి.  మీరు ఎన్ఎస్ఈ లో ఉన్న కంపెనీల గురించి అవి చేసే వ్యాపారాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఎన్ఎస్ఈ వెబ్సైటు లో చూడొచ్చు.  షేర్లలో పెట్టుబడి చేసేందుకు డీమ్యాట్ ఖాతాను ఏదైనా బ్రోకింగ్ సంస్థ నుంచి తీసుకోవాలి. దీంట్లో ట్రేడింగ్ , డీమ్యాట్ ఖాతాలుంటాయి. ట్రేడింగ్ ఖాతా ద్వారా షేర్ల క్రయవిక్రయాలు చేయవచ్చు. డీమ్యాట్ ఖాతాలో మీరు కొనుగోలు చేసిన షేర్లు భద్రంగా ఉంటాయి. డిపాజిటరీ సంస్థలో మీరు కొనుగోలు చేసిన షేర్లు డీమెటిరీయలైజెడ్ రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. షేర్లలో పెట్టుబడి నష్టభయం కలిగిఉంటుంది . కాబట్టి మీ నష్టభయం అంచనా వేసుకుని నేరుగా షేర్లలో మదుపు చేయాలి. షేర్ల ఎంపికలో నిపుణుల సలహాలను తీసుకోవడం మంచిది. దీని బదులు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మదుపు చేయవచ్చు. ఇవి పరోక్షంగా షేర్స్ లో మదుపు చేస్తాయి. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవచ్చు.

మరిన్ని

మీ ప్రశ్న