close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

స‌ర్ నేను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న ఖాతా ప్రారంభించాను. ఖాతాకు సంబంధించి బ్యాంకు ఎటువంటి పాస్‌బుక్ ఇవ్వ‌లేదు. న‌గ‌దు నా ఖాతా నుంచి నేరుగా ఏపీవై ఖాతాలో జ‌మ‌వుతుంద‌ని చెప్పారు. ఖాతాలో జ‌మ‌వుతుందో లేదో ఎలా తెలుసుకోవాలి. మా కుటుంబ స‌భ్యులు ఈ ఖాతాను నిర్వ‌హించే అవ‌కాశ‌ముందా?

Asked by Abdul rahiman on
మీరు పాన్ నంబ‌ర్‌, బ్యాంకు ఖాతా ఖాతా సంఖ్య‌ ద్వారా ఈ కింద ఇచ్చిన లింక్ సాయంతో ఖాతా వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. https://npslite-nsdl.com/CRAlite/EPranAPYOnloadAction.do అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న ఖాతాకు సంబంధించి అన్ని వివ‌రాలు న‌మోదిత మొబైల్ నంబ‌ర్‌కి వ‌స్తాయి. ఖాతాలో న‌గ‌దు క్రెడిట్ అయిన‌ప్పడు ఎస్ఎంఎస్ ద్వారా స‌మాచార‌మందుతుంది. చందాదారులు నామినీ పేరు, చిరునామా, ఫోన్‌నంబ‌ర్ వంటివి మార్చుకునే అవ‌కాశం కూడా ఉంది. మీ ప్రాన్ నంబ‌ర్‌, బ్యాంకు ఖాతా సంఖ్య‌ కుటుంబ స‌భ్యుల‌కు తెలిస్తే వారు కూడా ఖాతాను నిర్వ‌హించే అవ‌కాశం ఉంటుంది.

మరిన్ని

మీ ప్రశ్న