Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్. నేను ఖమ్మం లో ఉన్న నా ఇల్లు అమ్మి, వచ్చిన మొత్తం సొమ్ము హైదరాబాద్ లో ఫ్లాట్ కొనటానికి వెచ్చించాను. వచ్చే సంవత్సరం ఆదాయపన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి నేను కాపిటల్ గైన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలా?      

Asked by సూర్యనారాయణ on
మీరు అమ్మిన ఇంటిని కనీసం 2 ఏళ్ళ క్రితం కొన్నట్టయితే దీర్ఘకాల మూలధన ఆదాయ పన్ను వర్తిస్తుంది. అయితే, అమ్మిన 2 ఏళ్ళ లోపు మరో ఇంటిని కొనుగోలు చేస్తే ఈ పన్ను నుంచి మినహాయింపు పొందొచ్చు. అయితే, మీరు కొనుగోలు చేసిన విషయాన్ని మీరు ఆదాయ పన్ను రిటర్న్స్ లో తెలపవలసి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఇంటిని కొన్న 2 ఏళ్ళ లోపు అమ్మినట్టయితే, స్వల్ప కాల మూలధన ఆదాయ పన్ను వర్తిస్తుంది. లాభాన్ని మీ ఆదాయానికి జత చేసి పన్ను లెక్కిస్తారు.

మరిన్ని

మీ ప్రశ్న