నిపుణులు ఇచ్చిన సమాధానాలు
-
హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
మీరు ఎంచుకునే టర్మ్ పాలసీ లో బీమా మొత్తం మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. ఐసీఐసీఐ, మాక్స్ లైఫ్ లేదా ఎస్బీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించవచ్చు.
-
నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
హెచ్డీఎఫ్సీ ప్రో గ్రోత్ ప్లస్ మదుపు, బీమా హామీ కలిపి ఇచ్చే ఒక యూలిప్ పాలసీ. ఇతర యూలిప్ పాలసీల వలే ఇందులో కూడా మోర్టాలిటీ, ఫండ్ మానేజ్మెంట్, రిస్క్ బెనిఫిట్ లాంటి ఎన్నో చార్జీలు విధిస్తారు. వీటి వల్ల మదుపు చేస్తే మొత్తం తగ్గిపోతుంది, కాబట్టి రాబడి కూడా తగ్గిపోతుంది.
మీరు పాలసీని వెనక్కి ఇస్తే వచ్చే మొత్తం గురించి ఆరా తీసి కుదిరితే పాలసీ ని వెనక్కి ఇచ్చేయండి. ఇలా మిగిలిన డబ్బుని నెల నెలా సిప్ చేయండి. అలాగే మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 నుంచి 12 రెట్లు బీమా హామీ ఉండే టర్మ్ పాలసీ ని ఎంచుకోండి
-
సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?
బ్యాంకు టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి బ్యాంకు జనరల్ మేనేజర్ స్థాయి ఉన్నత అధికారుల ఈ-మెయిల్ తెలుసుకోవాలి. బ్యాంకు గ్రీవెన్స్ సెల్, జనరల్ మేనేజర్‌కు, బ్యాంకు అంబుడ్స్మను ఈమెయిల్ ద్వారా సమస్యను తెలియజేయండి.
-
డియర్ సిరి, 10 ఏళ్లలో రూ. 1 కోటి పొందాలంటే యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లో ఎంత మదుపు చేయాలి? అలాగే, పదవీ విరమణ అనంతరం మంచి పెన్షన్ పొందాలంటే ఎందులో మదుపు చేయాలి?
10 ఏళ్ళ పాటు ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయడం మంచి ఆలోచన. అయితే, మ్యూచువల్ ఫండ్స్ లో ఎంత రాబడి వస్తుందో ముందే ఊహించలేము. సగటుగా 12 శాతం రాబడి అనుకున్నట్టయితే నెల కి రూ. 43000 మదుపు చేస్తే 10 ఏళ్ళకి సుమారుగా రూ. 1 కోటి వరకు పొందగలరు.
పదవీ విరమణ కోసం ఎన్పీఎస్ ఎంచుకోవచ్చు. అందులో పదవీ విరమణ నిధి తో పాటు మంచి పెన్షన్ కూడా పొందే అవకాశం ఉంటుంది.
-
సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ప్లానర్ అవ్వాలంటే సెబీ వద్ద ఎలా నమోదు చేసుకోవాలి? ఎలాంటి పరీక్ష రాయాలి? తేలియజేయగలరు.
ఈ పరీక్ష(5 మాడ్యూల్స్) రాయడానికి మీరు ఎఫ్‌పీఎస్‌బీ బోర్డు ని సంప్రదించవచ్చు. ఈ కింది లింక్ లో మీ ప్రశ్నలను వారిని అడగవచ్చు. https://india.fpsb.org/contact/
-
సర్, ఒకవేళ పన్ను మినహాయింపు గల డిపాజిట్ కాల పరిమితి ముగిసే ముందే ఖాతాదారుడు మరణిస్తే నామినీ డిపాజిట్ ని మూసివేయచ్చ?
డిపాజిటరు మరణిస్తే, నామినీ కి రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి, డిపాజిట్ ని యధావిధిగా కొనసాగించవచ్చు. రెండు, వెంటనే దాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఇలా చేస్తే ఎటువంటి నామినీ పై ఎటువంటి పెనాల్టీ విధించారు. నామినీ బ్యాంకు ని సంప్రదించకపోతే డిపాజిట్ కొనసాగుతూనే ఉంటుంది.
-
సెక్షన్ 80ttb అంటే ఏంటి?
ఈ సెక్షన్ ద్వారా 60 ఏళ్ళ పైన వయసు గల వారికి బ్యాంకు డిపాజిట్ల వడ్డీ పై ఏడాదికి రూ. 50 వేల వరకు మినహాయింపు పొందొచ్చు.
-
సర్, నా పేరు రవి కృష్ణ. పదవీ విరామనా తరువాత నెలసరి పెన్షన్ కోసం ఏ పాలసీ బాగుంటుంది? మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తే మంచిదా లేక పెన్షన్ పాలసీ ఆ?
మార్కెట్లో లభించే చాలా పెన్షన్ పాలసీలు అధిక చార్జీలు కలిగి ఉంటాయి. దీని వల్ల సరైన రాబడి లభించదు. మీరు పదవీ విరమణ నిధి, పెన్షన్ కోసం మ్యూచువల్ ఫండ్లు, ఎన్పీఎస్ లాంటి పథకాల్లో మదుపు చేయవచ్చు.
ఎన్పీఎస్ లో పెన్షన్ కూడా లభిస్తుంది. మ్యూచువల్ ఫండ్లలో సమకూర్చుకున్న నిధితో సిస్టమాటిక్ విత్డ్రావాల్ ప్లాన్ ద్వారా నెల నెలా మీ డబ్బుని వెనక్కి తీసుకోవచ్చు.
-
సర్, నా వయసు 32. నా నెలసరి జీతం రూ. 40 వేలు. నాకు 4 ఏళ్ళ పాప ఉంది. ఆర్ధిక సలహాలు ఇవ్వండి. మ్యూచువల్ ఫండ్ లో మదుపు చేయాలా లేక సిప్ లో నా?
ముందుగా మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు, అంటే సుమారుగా రూ. 75 లక్షల బీమా హామీ ఉండేలా చూసుకోండి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. ఆరోగ్య బీమా పాలసీ కూడా తీసుకోవడం చాలా మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి. మీ పాప చదువు లేదా పెళ్లి కోసం సుకన్య సమృద్ధి పధకం ఎంచుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో కాస్ట్ రిస్క్ ఉంటుంది. ఒకోసారి ఫండ్ లో నష్టాలూ రావచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడానికి రెండు పద్ధతులు - ఒకటి లంప్సమ్, రెండు సిప్. సిప్ అంటే ప్రతి నెలా ఫండ్ లో నేరుగా మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు చేరి దానికి తగ్గ యూనిట్స్ కొనుగోలు చేయడం. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు.
-
హాయ్ సిరి, నేను ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ తీసుకున్నాను. బీమా హామీ రూ 5 లక్షలు. వార్షిక ప్రీమియం రూ 28 వేలు . మెచ్యూరిటీ 2040 సం . ఈ పాలసీ ఏమైనా ఉపయోగం ఉంటుందా ?
బీమా, పెట్టుబడి కలిపి ఉన్న పధకాల (ఎండోమెంట్, హోల్ లైఫ్ , మనీ బ్యాక్, యూలిప్స్ లాంటివి) నుంచి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. వీటిలో బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ, ప్రీమియం ఎక్కువ . ముందుగా మీరు ఒక టర్మ్ జీవిత బీమా పాలసీ తీసుకోండి . టర్మ్ పాలసీ ని వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పీపీఎఫ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మంచివి. అలాగే పదవీవిరమణ కోసం ఎన్పీఎస్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మంచివి.
-
మీ ఖాతా నంబర్ xxxx నుంచి, 22-11-2019 తరువాత చెల్లింపులు చేయబడవు, కెవైసి ని పూర్తిచేయండి . దీని అర్ధం తెలుపగలరు.
మీ బ్యాంకు బ్రాంచ్ కి వెళ్లి మీ పాన్ (PAN ) ను ఇవ్వవలసి ఉంటుంది. మీకు పాన్ (PAN ) లేకపోతె ఫారం 60 ని నింపి ఇవ్వాలి. మీరు ఆన్లైన్ లో కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా ’ UPDATE PAN ’ ని క్లిక్ చేసి మీ PAN లేదా ఫారం 60 ని అప్లోడ్ చేయవచ్చు. లేదా మీ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ వారికి ఇమెయిల్ ద్వారా కూడా పంపవచ్చు.
-
స్మార్ట్ డిపాజిట్ గురించి చెప్పండి. నెల నెలా డిపాజిట్ చేయాలా లేక ఎప్పుడైనా చేయవచ్చా?
స్మార్ట్ డిపాజిట్ లో బ్యాంకు ని బట్టి నియమాలు ఉంటాయి. మీకు వీలు ఉన్నప్పుడల్లా ఇందులో డిపాజిట్ చేయవచ్చు. అవసరం ఉన్నప్పుడు అతి తక్కువ సమయం లో డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. వడ్డీ కూడా పొదుపు ఖాతా కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది.
-
సార్ ఆన్లైన్లో ఐసిఐసిఐ బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేశాను. దానికి పాస్ బుక్కు, డెబిట్ కార్డు ఎలా వస్తాయి చెప్తారా?
ఈ విషయం గురించి మీరు నేరుగా ఐసీఐసీఐ బ్యాంకు ని సంప్రదించడం మంచిది. సాధారణంగా, మీరు ఆన్లైన్ ఖాతా లో తెలిపిన చిరునామా కి వారు వీటిని పంపిస్తారు.
-
నేను ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. మంచి పాలసీని సూచించండి.
ప్రస్తుతం ఉన్న వైద్య ఖర్చులను ద్రుష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా కలిగి ఉండడం ఏంతో అవసరం. మీరు తీసుకునే పాలసీ బీమా హామీ మొత్తం మీరు చెల్లించగలిగే ప్రీమియం, నివసించే ప్రాంతంలో ఉన్న వైద్య కర్చులను భరించగలిగేలా ఉండాలి. దీనికోసం కనీసం రూ. 3 నుంచి 5 లక్షల బీమా కల్పించే పాలసీ తీసుకోవడం మంచిది. భవిష్యత్తులో అవసరాన్ని బట్టీ ఈ మొత్తాన్ని పెంచుకునే వీలుని కూడా బీమా సంస్థలు కలిపిస్తున్నాయి.
ఆరోగ్య బీమా మీకు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు అందరికీ ఉండడం అవసరం. దీనికోసం మీరు ఫామిలీ ఫ్లోటర్ పాలసీని తీసుకోవచ్చు.
పాలసీ ఎంచుకునే ముందు పాలసీకి సంబంధించిన నెట్ వర్క్ ఆసుపత్రులు మీకు అందుబాటులో ఉన్నాయా, సబ్ లిమిట్, కో- పే, ముందుగా ఉన్న అనారోగ్యాలకు వెయిటింగ్ పీరియడ్, ఎంత వయసు వరకూ పాలసీని కొనసాగించే అవకాశం ఉంది, పాలసీ అందించే సంస్థ క్లెయిమ్ చెల్లింపులు ఎలా ఉన్నాయి అనే వివరాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.
కింది పాలసీలను పరిశీలించవచ్చు
ఐసీఐసీఐ లోమ్బార్డ్ కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ
అపోలో మ్యూనిక్ ఆప్టిమా రిస్టోర్ పాలసీ
మాక్స్ భూపా హెల్త్ కంపానియన్ పాలసీ
హెచ్ డీ ఎఫ్ సీ హెల్త్ సురక్షా
Saranya Reddy
CFA (ICFAI), Certified Financial Planner
-
లయబిలిటీ బీమా ప్రీమియం గురించి తెలుపగలరు. జీవిత బీమా లయబిలిటీ బీమాను అందిస్తుందా ?
లయబిలిటీ బీమా అనేది మన వల్ల ఇతరులకు నష్టం వాటిల్లితే మన తరఫున బీమా సంస్థ నష్టపరిహారం చెల్లిస్తుంది . అందువల్ల కారు లేదా బైక్ లకు థర్డ్ పార్టీ బీమాను తప్పనిసరి చేశారు. అలాగే వృత్తి , వ్యాపారాలలో వినియోగదారునికి నష్టపరిహారం చెల్లిస్తారు. ఉదా : వైద్యవృత్తి, చార్టర్డ్ అకౌంటెంట్ , వస్తు సేవల్లో లోపాలు వంటి వాటి నుంచి నష్టం వాటిల్లితే , నష్ట పరిహారం చెల్లిస్తాయి. ఈ బీమాను సాధారణ బీమా సంస్థలు ఇస్తాయి . జీవిత బీమా సంస్థలు ఎండోమెంట్, మనీ బ్యాక్ , టర్మ్ జీవిత బీమా ను అందిస్తాయి.
-
ప్రస్తుతం బ్యాంక్ లో పొదుపు ఖాతాలో ఎంత వరకూ డబ్బు ఉంచవచ్చు. రూ. 5 లక్షల పైన ఉంటే ఆదాయపు పన్ను చెల్లించాలా?
బ్యాంకు ఖాతా కలిగిన వారు తమ ఖాతాలో ఎంత డబ్బునైనా పొదుపు చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను విషయం చూస్తే దాని ద్వారా వచ్చే రాబడిపై రూ. 10వేల వరకూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.10 వేలు పై బడి వచ్చిన రాబడికి పన్నుచెల్లించాలి. కొత్త గా బడ్జెట్ 2018 లో వచ్చిన మినహాయింపుల ప్రకారం సీనియర్ సిటిజన్లకు మాత్రం వడ్డీ గా లభించే ఆదాయం రూ.50 వేల వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది. రూ.50 వేల పైన వచ్చే ఆదాయానికి పన్ను చెల్లించాలి.
-
నా పేరు అమర్నాథ్. మాకు 2017 నవంబర్‌లో పాప పుట్టింది. కుటుంబంలో ఆర్జించేది నేనొక్కడినే. ప్రస్తుతం నాకు రూ.2 లక్షల విలువ చేసే ఎల్ఐసీ జీవన్ ఆనంద్, రూ.7 లక్షల విలువ గల ఎల్ఐసీ జీవన్ సరళ్ పాలసీలు ఉన్నాయి. నేను టర్మ్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. పాలసీ తీసుకునేటప్పుడు ప్యూర్ టర్మ్ పాలసీ తీసుకోవాలా లేదా మనీబ్యాక్, హోల్ లైఫ్ పాలసీ తీసుకోవాలా తెలపగలరు. పాలసీకి రైడర్లను జోడించాలా లేదా కూడా తెలుపగలరు.
మీరు ప్యూర్ టర్మ్ పాలసీ తీసుకోవడం మంచిది. ఎందుకంటే వీటిలో తక్కువ ప్రీమియానికే, అధిక హామీ మొత్తం(సమ్ అస్యూర్డ్) ఉంటుంది. అదే మనీబ్యాక్, హోల్ లైఫ్ అనేవి పొదుపుతో పాటు పెట్టుబడులకు ఉద్దేశించినవి. ఇందులో ప్రీమియం అధికంగా ఉండి, హామీ మొత్తం తక్కువగా ఉంటుంది.
మీ వార్షికాదాయానికి 10 రెట్లు ఎక్కువ మొత్తానికి, 60 ఏళ్ల నుంచి ప్రస్తుత మీ వయసు తీసివేయగా వచ్చే కాలవ్యవధికి టర్మ్ పాలసీ తీసుకోండి. దీనికి అదనంగా రైడర్లను పాలసీతో కలిపి తీసుకోండి. రైడర్లతో మరికొంత తక్కువ ప్రీమియంతో అదనపు ప్రయోజనాలుంటాయి. కంపెనీ క్లెయిం పరిష్కార చరిత్ర ఆధారంగా పాలసీ తీసుకోవడం మంచిది. దీని కోసం మీరు ఐసీఐసీఐ ప్రు ప్రొటెక్ట్ స్మార్ట్, హెచ్డీఎఫ్సీ లైఫ్, మాక్స్ లైఫ్ లాంటి పథకాలను పరిశీలించండి. ఎల్ఐసీలో కూడా టర్మ్ పాలసీ తీసుకోవచ్చు. కానీ ప్రైవేట్ సంస్థలతో పోలిస్తే ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉంటుంది.
మీకు అందుతున్న ప్రయోజనాలను బట్టి ప్రస్తుతమున్న ఎల్ఐసీ పాలసీలను కొనసాగించవచ్చు లేదా ఉపసంహరించుకోవచ్చు. ఒక వేళ మీరు ఈ పాలసీలను కొనసాగించాలనుకుంటే టర్మ్ పాలసీకి నగదును సర్దుబాటు చేసుకోండి.
-
హాయ్ డియర్ సిరి, నా పేరు శివ ప్రసాద్ చౌదరి చింతా. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని, నా పొదుపు ఖాతాను శాలరీ ఖాతాగా ఎలా మార్చుకోవాలి?
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల శాలరీ ఖాతాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నిర్వహిస్తారు. మీకు ఎస్బీఐలో పొదుపు ఖాతా ఉంటే, మీ సంస్థలో జీతాలు పంపిణీ చేసే అధికారి వద్ద నుంచి మీ ఎంప్లాయి నెంబరు, బ్రాంచి, బ్యాంకు ఖాతా నెంబరు తదితర వివరాలతో, ఒక లేఖను తీసుకు రావాలి.
-
హాయ సిరి, నా పేరు ప్రకాశ్. వయసు 31 సంవత్సరాలు. మా కుటుంబంలో మా అమ్మ (56), నా భార్య (25), బాబు (2) ఉంటాము. చిన్న ఉద్యోగం చేస్తున్నాను, వేతనం రూ.15 వేలు. ఇప్పటివరకు ఎటువంటి బీమా తీసుకోలేదు. ఈ కొత్త సంవత్సరంలో బీమా పాలసీ తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు, నా కుటుంబానికి ఉపయోగపడే ఒక బీమా పాలసీ, కంపెనీ వివరాలను తెలియజేయగలరు. బీమా పాలసీకి ఆరోగ్య బీమాకి తేడా ఉందా చెప్పగలరు..
ఆదాయం పొందుతున్న వ్యక్తిగా మీరు మీ వార్షిక వేతనానికి 10-15 రెట్లు బీమా హామీనిచ్చే పాలసీని 60 ఏళ్ల వయసు వరకు ఉండేలా తీసుకోవాలి. భవిష్యత్తులో క్లెయిమ్ విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కచ్చితమైన వివరాలను బీమా సంస్థకు అందించాలి. దీంతో పాటు బ్యాంకు లేదా పోస్టాఫీస్‌లో రికరింగ్ డిపాజిట్ ప్రారంభించి నెలకు కొంత బాబు ఉన్నత విద్య కోసం పొదుపు చేయడం మంచిది.
-
మంచి బీమా కంపెనీల పేర్లు చెప్పగలరు.
బీమా కంపెనీ ఎంచుకునే సమయం లో దాని గత క్లెయిమ్‌ల చరిత్ర, కంపెనీ నిర్వహణ, ప్రీమియంలు లాంటివి దృష్టిలో పెట్టుకోవాలి. జీవిత బీమా పాలసీల్లో ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, మాక్స్ లైఫ్, ఎస్బీఐ కంపెనీల ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించవచ్చు. ఆరోగ్య బీమా కోసం మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్, సిగ్నా టీటీకే కంపెనీలను పరిశీలించవచ్చు.
-
హాయ్ సిరి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా పోస్ట్ ఆఫీస్ లో డిజిటల్ పొదుపు ఖాతా తెరిచి ఉపయోగించవచ్చా?
18 ఏళ్ళు నిండి, పాన్ (PAN), ఆధార్ కలిగి ఉన్న వారు డిజిటల్ పొదుపు ఖాతా ని తెరవవచ్చు. ఖాతా తెరచిన 12 నెలల లోపు కెవైసి వివరాలను పూర్తి చేయాలి .
గరిష్టంగా రూ 2 లక్షల వరకు జమ చేయవచ్చు. కెవైసి పూర్తయిన తరువాత పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాతో లింక్ చేయవచ్చు.
-
ప్రస్తుతం బ్యాంక్ లో పొదుపు ఖాతాలో ఎంత వరకూ డబ్బు ఉంచవచ్చు. రూ. 5 లక్షల పైన ఉంటే ఆదాయపు పన్ను చెల్లించాలా?
బ్యాంకు ఖాతా కలిగిన వారు తమ ఖాతాలో ఎంత డబ్బునైనా పొదుపు చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను విషయం చూస్తే దాని ద్వారా వచ్చే రాబడిపై రూ. 10వేల వరకూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.10 వేలు పై బడి వచ్చిన రాబడికి పన్నుచెల్లించాలి. కొత్త గా బడ్జెట్ 2018 లో వచ్చిన మినహాయింపుల ప్రకారం సీనియర్ సిటిజన్లకు మాత్రం వడ్డీ గా లభించే ఆదాయం రూ.50 వేల వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది. రూ.50 వేల పైన వచ్చే ఆదాయానికి పన్ను చెల్లించాలి.
డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పోరేషన్ ప్రకారం ప్రస్తుతం బ్యాంకుల్లో ఉన్న మొత్తం రూ. 1లక్ష వరకూ భద్రత ఉంటుంది. ప్రస్తుతం దాని స్థానంలో ఎఫ్ఆర్డీఐ బిల్లు వస్తే భద్రత ఉండదని ప్రచారంలో ఉంది. అయితే ఇది ఇంకా ఆమోదం పొందే వరకూ రాలేదు. ఇంకా బిల్లు డ్రాప్ట్ స్థాయిలో ఉంది. బిల్లు రూపొందాక సవరణలు జరిగాక ఆమోదం పొందితే ఈ చట్టం అమల్లోకి వస్తుంది. అయితే ఆ బిల్లులో ఎంత మొత్తానికి భద్రత ఉంటుందనేది ఇంకా తెలియాలి. కాబట్టి బ్యాంకులో డబ్బు దాచుకునే విషయంలో ఆందోళన వద్దు.
-
నమస్తే సర్, నా పేరు కృష్ణ. మా నాన్న వయసు 60, మా అమ్మ వయసు 45. ఇప్పుడు బీమా పాలసీలు తీసుకోవాలనుకొంటున్నారు. ఏవైనా మంచి పోలసీలు ఉంటే చెప్పండి.
జీవిత బీమా పాలసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాలసీ దారుడికి ఏదైనా జరిగితే వారి కుటుంబానికి ఆర్ధికంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం. ఒకవేళ మీరు సంపాదన పరులైతే మీ పేరు మీద పాలసీ తీసుకుంటే బాగుంటుంది.
మీ తల్లిదండ్రులకి వీలయితే ఒక మంచి ఆరోగ్య బీమా పాలసీ తీసుకోండి. మాక్స్ బూపా, అపోలో మునిచ్ లాంటి కంపెనీల ఫామిలీ ఫ్లోటర్ పాలసీలను పరిశీలించండి. వారి వయసుకి ప్రీమియం కాస్త ఎక్కువ ఉండవచ్చు.
-
నా వయసు 23 సంవత్సరాలు. నేను బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా? టర్మ్ పాలసీ లేదా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఏది తీసుకుంటే మేలు? సూచించగలరు.
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది. ఇతర బీమా పాలసీలతో పోలిస్తే ప్రీమియం తక్కువగా ఉంటుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగి కాకపోతే టర్మ్ బీమా తీసుకోవాలి. మీ వార్షిక వేతనానికి 10-15 రెట్లు బీమా హామీనిచ్చే పాలసీని 60 ఏళ్ల వయసు వరకు ఉండేలా తీసుకోవాలి. భవిష్యత్తులో క్లెయిమ్ విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కచ్చితమైన వివరాలను బీమా సంస్థకు అందించాలి. హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ లైఫ్ , మ్యాక్స్ లైఫ్ టర్మ్ బీమా పాలసీలను పరిశీలించండి
-
మ్యూచువల్ ఫండ్లలో 2000 చొప్పున 10 ఏళ్ళ చేస్తే ఎంత మొత్తం వస్తుంది ?
మ్యూచువల్ ఫండ్లలో ఎంత రాబడి వస్తుందో ముందే కచ్చితంగా చెప్పలేము. ఇది ఫండ్ వ్యూహం, ఫండ్ మేనేజర్ పని తీరు, మార్కెట్ స్థితిగతులు లాంటి వాటి పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, ఒక ఇండెక్స్ ఫండ్ ఎంచుకుంటే సగటున 12 శాతం చొప్పున రాబడి ఆశించవచ్చు.
నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నా పేరు కుమార్, మాది హైదరాబాద్, నేను రూ.10 లక్షల రుణం తీసుకుని హైదరాబాద్‌లో ఒక ఫ్లాట్ కొనుగోలు చేయాలనుకుంటున్నాను. రుణం తిరిగి చెల్లించేందుకు ఎంత కాలపరిమితి ఉండాలి? 20 సంవత్సరాల కాలవ్యవధి పెట్టుకోమని నా బ్రదర్ సూచిస్తున్నారు. 20 సంవత్సరాలకు వడ్డీ సమానంగా విభజిస్తారని, ఒకవేళ రూ.5 లక్షలు ఒకేసారి చెల్లిస్తే భవిష్యత్తులో వడ్డీ రాయితీ ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల తక్కువ లేదా ఎక్కువ కాలపరిమితులలో ఏది మంచిది తెలుపగలరు.
కాలపరిమితి పెరిగితే, మీరు చెల్లించవలసిన వడ్డీ మొత్తం కూడా పెరుగుతుంది. ఉదాహరణకి: మీరు 15 సంవత్సరాల కాలవ్యవధితో రూ. 10 లక్షల రుణం, 8.50 శాతం వడ్డీతో తీసుకుంటే, చెల్లించవలసిన ఈఎమ్ఐ నెలకు రూ.9,847. పూర్తి కాలపరిమితికి చెల్లించే మొత్తం వడ్డీ రూ.7.73 లక్షలు
అదేవిధంగా కాలపరిమితి 20 సంత్సరాలు అయితే ఈఎమ్ఐ రూ.8,680. మీరు చెల్లించే మొత్తం వడ్డీ రూ.10.83 లక్షలు. ఒకవేళ మీరు ఎక్కువ మొత్తంలో తిరిగి చెల్లించినా, మీరు చెల్లించవలసిన ఈఎమ్ఐలో మార్పు ఉండదు. చెల్లించవలసిన కాలవ్యవధిలో కొన్ని నెలలు తగ్గుతాయి. తద్వారా వడ్డీ భారం కొంత వరకు తగ్గుతుంది.
ఒక వేళ మీరు 20 సంవత్సరాల కాలపరిమితి తీసుకుని, రెండు ఈఎమ్ఐల మధ్య వ్యత్యాసం రూ.1,167ను మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే అదనంగా చెల్లించే వడ్డీ మొత్తం రూ. 3.10 లక్షలు (రూ.10.83లక్షలు - రూ.7.73లక్షలు) 130నెలలు(11సంవత్సరాలలో) తిరిగి పొందవచ్చు.
-
నా వద్ద రూ. 5 లక్షలు ఉన్నాయి. ఇందులో నుంచి నెలసరి వడ్డీ కావాలంటే ఎందులో మదుపు చేయాలి?
మీరు ఈ మొత్తాన్ని బ్యాంకు లో ఫిక్సిడ్ డిపాజిట్ చేయవచ్చు. కాల పరిమితి, వడ్డీ మొత్తాన్ని ఎంచుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ లో నెలసరి ఆదాయ పధకం కూడా ఎంచుకోవచ్చు.
-
క్రెడిట్ కార్డు ద్వారా నగదు తీసుకుంటే చార్జీలు పడతాయా?
క్రెడిట్ కార్డు ద్వారా నగదు వెనక్కి తీసుకుంటే, తీసుకున్న మొత్తం మీద 2.5 నుంచి 3 శాతం వరకు చార్జీలు విధిస్తారు. కనీస చార్జీలు రూ. 250 నుంచి 300 వరకు ఉంటాయి. దీనితో పాటు మీరు తీసుకున్న నగదు పై వడ్డీ కూడా కట్టవలసి ఉంటుంది. ఇది నెలకు 2.70 నుంచి 2.85 శాతం వరకు ఉండవచ్చు. చక్ర వడ్డీ తో కలిపి చుస్తే ఏడాదికి 38 నుంచి 40 శాతం వరకు పడచ్చు. డబ్బు తీసుకున్న రోజు నుంచే వడ్డీ లెక్కిస్తారు.
ఉదాహరణకి మీరు క్రెడిట్ కార్డు పై రూ. 25 వేలు నగదు తీసుకుంటే నగదు చార్జీలు, వడ్డీ తో కలిపి నెలకు రూ. 1500 చెల్లించాల్సి రావచ్చు. దీని బదులు వ్యక్తిగత రుణం, బంగారం, ఫిక్సిడ్ డిపాజిట్లు, బీమా పాలసీలు లాంటి వాటి పై రుణాలను పరిశీలించండి.
-
భూమిపై ముద్ర లోన్ తీసుకోవాలి అనుకుంటున్నాను
ముద్ర రుణం అనేది స్వయం ఉపాధి మొదలు పెట్టాలనుకున్న వారి కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పధకం. మీరు మీ దగ్గరలోని బ్యాంకు ని సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.
-
హాయ్ సర్ నాపేరు అజయ్. మా నాన్నగారు, నేను పోలిస్ శాఖలో పని చేస్తున్నాము. మా నాన్న గారు ఈ మధ్య సొంత ఇల్లు కొన్నారు. దాని విలువ రూ.62 లక్షలు. మేము ఎల్ఐసీ హోం లోన్ తీసుకున్నాం. దానిని ఎస్బీఐకి ట్రాన్స్ఫర్ చేశాం. ఎస్బీఐ ఎల్ఐసీకి రూ.38 లక్షలు ఇచ్చింది. అయితే మాకు PMAY వర్తిస్తుందా?
PMAY సబ్సిడీ కేవలం మొదటి సారి ఇల్లు కొనుగోలు చేసేవారికి మాత్రమే వర్తిస్తుంది. ఒక రుణదాత వద్ద రుణం తీసుకొని మరో బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేస్తే PMAY వర్తించదు.
-
సర్, క్రెడిట్ కార్డు తో బంగారం కొనుగోలు చేయవచ్చా? ఏదైనా చార్జీలు ఉంటాయా?
క్రెడిట్ కార్డు తో బంగారం లేదా ఏదైనా కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా, క్రెడిట్ కార్డు వాడకం పై చార్జీలు ఉండవు. మీరు ఒకసారి దుకానుదారుడితో ఈ విషయాన్ని తెలుసుకోవడం మంచిది. సకాలం లో బిల్లు ని చెల్లిస్తూ ఉండండి.
-
నా పేరు ప్రదీప్, హైదరాబాద్ నివాసిని. ప్రస్తుతం నేను మ్యూచువల్ ఫండ్లలో రూ. 6000 సిప్ ద్వారా మదుపు చేస్తున్నాను(రూ. 3000 కోటక్ మహీంద్రా లో, రూ. 3000 ఎల్ అండ్ టీ లో) 20 ఏళ్ళు చేద్దామనుకుంటున్నాను. చివరికి ఎంత లభిస్తుంది? సలహా ఇవ్వండి.
మ్యూచువల్ ఫండ్లలో ఎంత లభిస్తుందో ఖచ్చితంగా చెప్పలేము. కేవలం గత సంవత్సరాల రాబడి బట్టి ఒక అంచనా కి రావచ్చు. మీరు మదుపు చేసిన పధకాల పని తీరు సరి చూసుకోండి. వాటిని ప్రతి సంవత్సరం గమనిస్తూ ఉండండి.
20 ఏళ్ళ పాటు నెల నెలా రూ. 6000 సిప్ చేస్తే 12 శాతం రాబడి ప్రకారం సుమారుగా రూ. 60 లక్షలు సమకూర్చుకోవచ్చు. దీర్ఘకాలం పాటు మదుపు చేయాలనే మీ ఆలోచన సరైనదే.
-
మ్యూచువల్ ఫండ్లలో 2000 చొప్పున 10 ఏళ్ళ చేస్తే ఎంత మొత్తం వస్తుంది ?
మ్యూచువల్ ఫండ్లలో ఎంత రాబడి వస్తుందో ముందే కచ్చితంగా చెప్పలేము. ఇది ఫండ్ వ్యూహం, ఫండ్ మేనేజర్ పని తీరు, మార్కెట్ స్థితిగతులు లాంటి వాటి పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, ఒక ఇండెక్స్ ఫండ్ ఎంచుకుంటే సగటున 12 శాతం చొప్పున రాబడి ఆశించవచ్చు.
నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
హాయ్, నా పేరు అమర్, నాకు హైదరాబాద్‌లో ఒకటి, బెంగుళూరులో మరొకటి, మొత్తానికి రెండు ఇళ్ళు ఉన్నయి. మేము ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్నాము. బడ్జెట్ 2019-20 ప్రకారం పన్ను మినహాయింపు కోసం రెండు గృహరుణాల వడ్డీని చూపించవచ్చా? ఒకవేళ అవును అయితే ఏ సెక్షన్ కింద, ఏవిధంగా రెండవ ఇంటిని చూపించాలి. నేను హైదరాబాద్‌లో ఉన్న ఇంటికి ( 8.25 శాతం వడ్డీ రేటు చొప్పున) దాదాపు రూ.1 లక్ష, బెంగుళూరులో ఉన్న ఇంటికి( 9.25 శాతం వడ్డీ రేటు చొప్పున) దాదాపు 2.2 లక్షలు వడ్డీ చెల్లిస్తున్నాను, హైదరాబాద్‌లో ఉన్న ఇంటిపై టాప్అప్లోన్ తీసుకుని, బెంగుళూరులో ఉన్న ఇంటిపై రుణం చెల్లించడం మంచిదేనా? తెలుపగలరు.
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 24బీ ప్రకారం రెండు గృహ రుణాల వడ్డీపై మినహాయింపు పరిధి రూ. 2 లక్షలు. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్ లో బెంగుళూరు ఇంటిని అద్దెకు ఇచ్చి (నోషనల్ రెంట్ నెలకు రూ. 15 వేలు చూపించవచ్చు), హైదరాబాద్ ఇంటిలో మీరు ఉంటున్నట్లు చూపిస్తే, సెక్షన్ 24బీ ప్రకారం దాదాపుగా రూ.2 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఇటివల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్థిక మంత్రి రెండవ ఇంటిపై వచ్చే నోషనల్ రెంట్(అద్దె అంచనా) ఆదాయంపై పన్ను మినహాయింపును ప్రతిపాదించారు. అంటే, వచ్చే ఏడాది నుంచి మీకు రెండు ఇళ్ళు ఉంటే, ఇప్పటి లాగా కాకుండా రెండిళ్ళ లోను నివసిస్తున్నట్టుగా చూపించవచ్చు. సెక్షన్ 24b ప్రకారం పన్ను మినహాయింపు లో మార్పు లేదు.
టాప్అప్ లోను తీసుకోవడం మంచిదికాదు. ప్రస్తుతం ఉన్న రుణంపై టాప్లోను తీసుకుంటే, ప్రస్తుతం మీరు చెల్లించే వడ్డీరేటుకు 1-1.50 శాతం అధిక వడ్డీ రేటును విధిస్తారు. వడ్డీ రేటుతో పాటు ప్రాసెసింగ్ ఫీజు అదనంగా ఉంటుంది. అలాగే, మీరు తక్కువ వడ్డీ రేట్లతో గృహ రుణాన్ని అందిస్తున్న వేరే బ్యాంకుకు గృహ రుణాన్ని బదిలీ చేసుకునే ముందు ప్రాసెసింగ్ ఫీజులను పరిగణలోనికి తీసుకోవాలి.
-
నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
హెచ్డీఎఫ్సీ ప్రో గ్రోత్ ప్లస్ మదుపు, బీమా హామీ కలిపి ఇచ్చే ఒక యూలిప్ పాలసీ. ఇతర యూలిప్ పాలసీల వలే ఇందులో కూడా మోర్టాలిటీ, ఫండ్ మానేజ్మెంట్, రిస్క్ బెనిఫిట్ లాంటి ఎన్నో చార్జీలు విధిస్తారు. వీటి వల్ల మదుపు చేస్తే మొత్తం తగ్గిపోతుంది, కాబట్టి రాబడి కూడా తగ్గిపోతుంది.
మీరు పాలసీని వెనక్కి ఇస్తే వచ్చే మొత్తం గురించి ఆరా తీసి కుదిరితే పాలసీ ని వెనక్కి ఇచ్చేయండి. ఇలా మిగిలిన డబ్బుని నెల నెలా సిప్ చేయండి. అలాగే మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 నుంచి 12 రెట్లు బీమా హామీ ఉండే టర్మ్ పాలసీ ని ఎంచుకోండి.
-
నా పేరు ప్రదీప్, నిజామాబాదు నివాసిని.నా నెలసరి జీతం రూ. 40 వేలు. గత నెలలో నేను రూ. 1.5 కోటి బీమా హామీ గల ఐసీఐసీఐ టర్మ్ పాలసీ తీసుకున్నాను,ప్రీమియం రూ. 24,064. ఇది మంచిదేనా?
మీరు ఎంచుకున్న కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ ఉత్తమమైన 3 కంపెనీల్లో ఒకటి. మీ వివరాలన్నీ సరిగ్గా ఇచ్చారని భావిస్తున్నాము. ఇలా చేయడం వాళ్ళ క్లెయిమ్ సమయం లో మీ కుటుంబానికి ఎటువంటి సమస్యలు ఉండవు. మీరు తీసుకున్న బీమా హామీ కూడా సరిపోతుంది.
అలాగే ఆరోగ్య బీమా కోసం కూడా ఒక మంచి ఫ్లోటర్ పాలసీ తీసుకోండి. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్, సిగ్న టీటీకే వంటి కంపెనీల పాలసీలను పరిశీలించండి.
-
నా పేరు ప్రదీప్, నిజామాబాదు వాసిని. నేను మే 2017 నుంచి కోటక్ స్టాండర్డ్ మల్టీ కాప్, ఎల్ అండ్ టీ మిడ్ కాప్ ఫండ్ లో రూ. 3000 చొప్పున సిప్ చేస్తున్నాను. గత 6 నెలలుగా ఎల్ & టీ మిడ్ కాప్ ఫండ్ రాబడి తగ్గుతూ ఉంది. ఇందులో కొనసాగాలా లేదా మారమంటారా?
మీరు పేర్కొన్న ఫండ్లలో ఒకటి మల్టీ కాప్, ఒకటి మిడ్ కాప్ ఫండ్. ఈ రెండు ఫండ్ల పని తీరు బాగుంది, కానీ ఇవి రిస్క్ తో కూడుకున్నవి. మిడ్ కాప్ ఫండ్ లో రిస్క్ మరింత ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మార్కెట్ లో ఒడిదుడుకులు ఉన్నపుడు ఫండ్ నష్టపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీరు రిస్క్ తీసుకోగలిగితే ఈ రెండూ ఫండ్లలో కనీసం 10 ఏళ్ళు మదుపు చేయండి. లేదంటే ఒక ఐసీఐసీఐ పృ బ్లూచిప్ లాంటి ఒక లార్జ్ కాప్ ఫండ్ ని ఎంచుకోవచ్చు.
-
సర్, నేను రూ . 1.50 కోటి బీమా హామీ తో టర్మ్ పాలసీ తీసుకున్నాను. 40 ఏళ్ళ పాలసీ, ప్రీమియం రూ. 24,650. దీని బదులు ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. 10 ఏళ్లలో ఏడాదికి రూ. 54,600 కడితే చాలంటున్నారు. సలహా ఇవ్వండి.
టర్మ్ పాలసీ లో ప్రీమియం వెనక్కి ఆశించకూడదు. ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీలలో ప్రీమియం అధికంగా ఉంటుందని గమనించండి. మీరు తెలిపిన పాలసీ లో 10 ఏళ్లలో సుమారుగా రూ. 5,46,000 వరకు ప్రీమియం చెల్లించాలి. అయితే, ద్రవ్యోల్బణాన్ని దృష్టి లో పెట్టుకుని 40 ఏళ్ళకి ఈ మొత్తం సుమారుగా రూ. 11 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది.
మీరు ఎంచుకున్న పాలసీ కంపెనీ పేరు తెలుపలేదు. ప్రీమియం ని పాలసీ బజార్ లేక కవర్ ఫాక్స్ లో పరిశీలించారని భావిస్తున్నాము. మాక్స్ లైఫ్, ఐసీఐసీఐ పాలసీల క్లెయిమ్ సెటిల్మెంట్ బాగుంటుంది.
-
సర్, నాకు పీఎంఏవై పధకం కింద రూ. 10 లక్షల రుణానికి రూ. 2 లక్షల వరకు సబ్సిడీ వచ్చింది. ఇది సరైనదేనా?
ఈ పధకం కింద వ్యక్తి వార్షిక ఆదాయం, ఇంటి చదరపు అడుగులు లాంటి వాటిని బట్టి సబ్సిడీ నిర్ణయిస్తారు. ఈ కింది కథనాలు చదివి వివరంగా తెలుసుకోవచ్చు:
http://eenadusiri.net/PMAY-home-loans-subsidy-scheme-AAP6lVt
http://eenadusiri.net/how-to-get-subsidy-under-PMAY-JkfYf38
-
హాయ్ సిరి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా పోస్ట్ ఆఫీస్ లో డిజిటల్ పొదుపు ఖాతా తెరిచి ఉపయోగించవచ్చా?
18 ఏళ్ళు నిండి, పాన్ (PAN), ఆధార్ కలిగి ఉన్న వారు డిజిటల్ పొదుపు ఖాతా ని తెరవవచ్చు. ఖాతా తెరచిన 12 నెలల లోపు కెవైసి వివరాలను పూర్తి చేయాలి .
గరిష్టంగా రూ 2 లక్షల వరకు జమ చేయవచ్చు. కెవైసి పూర్తయిన తరువాత పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాతో లింక్ చేయవచ్చు.
-
ఎస్బిఐ లో రుణం తీసుకున్నాను. ఎం సి ఎల్ ఆర్ నుంచి రేపో రేట్ లోకి మారాలనుకుంటే రూ.5,800 లు ఫీ చెల్లించాలంటున్నారు . ఎందుకు?
రేపో రేట్ లోకి మారేటప్పుడు బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీ , స్టాంప్ డ్యూటీ కింద కొంత సొమ్ము వసూలు చేస్తాయి. ఎం సి ఎల్ ఆర్ కి , రేపో రేట్ కి వడ్డీ రేట్ లో ఎంత తేడా ఉందొ చూసుకోండి.
-
హాయ్ డియర్ సిరి, నా పేరు శివ ప్రసాద్ చౌదరి చింతా. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని, నా పొదుపు ఖాతాను శాలరీ ఖాతాగా ఎలా మార్చుకోవాలి?
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల శాలరీ ఖాతాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నిర్వహిస్తారు. మీకు ఎస్బీఐలో పొదుపు ఖాతా ఉంటే, మీ సంస్థలో జీతాలు పంపిణీ చేసే అధికారి వద్ద నుంచి మీ ఎంప్లాయి నెంబరు, బ్రాంచి, బ్యాంకు ఖాతా నెంబరు తదితర వివరాలతో, ఒక లేఖను తీసుకు రావాలి.
ఈ లేఖను మీ హోమ్ బ్రాంచిలో సబ్మిట్ చేస్తే, మీ పొదుపు ఖాతాను శాలరీ ఖాతాగా మారుస్తారు. మీకు ఎస్బీఐలో కాకుండా వేరొక బ్యాంకులో ఖాతా ఉంటే అన్ని వివరాలలో మీకు జీతాలు పంపిణీ చేసే అధికారిని సంప్రదించవచ్చు.
-
ప్రస్తుతం బ్యాంక్ లో పొదుపు ఖాతాలో ఎంత వరకూ డబ్బు ఉంచవచ్చు. రూ. 5 లక్షల పైన ఉంటే ఆదాయపు పన్ను చెల్లించాలా?
బ్యాంకు ఖాతా కలిగిన వారు తమ ఖాతాలో ఎంత డబ్బునైనా పొదుపు చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను విషయం చూస్తే దాని ద్వారా వచ్చే రాబడిపై రూ. 10వేల వరకూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.10 వేలు పై బడి వచ్చిన రాబడికి పన్నుచెల్లించాలి. కొత్త గా బడ్జెట్ 2018 లో వచ్చిన మినహాయింపుల ప్రకారం సీనియర్ సిటిజన్లకు మాత్రం వడ్డీ గా లభించే ఆదాయం రూ.50 వేల వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది. రూ.50 వేల పైన వచ్చే ఆదాయానికి పన్ను చెల్లించాలి.
డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పోరేషన్ ప్రకారం ప్రస్తుతం బ్యాంకుల్లో ఉన్న మొత్తం రూ. 1లక్ష వరకూ భద్రత ఉంటుంది. ప్రస్తుతం దాని స్థానంలో ఎఫ్ఆర్డీఐ బిల్లు వస్తే భద్రత ఉండదని ప్రచారంలో ఉంది. అయితే ఇది ఇంకా ఆమోదం పొందే వరకూ రాలేదు. ఇంకా బిల్లు డ్రాప్ట్ స్థాయిలో ఉంది. బిల్లు రూపొందాక సవరణలు జరిగాక ఆమోదం పొందితే ఈ చట్టం అమల్లోకి వస్తుంది. అయితే ఆ బిల్లులో ఎంత మొత్తానికి భద్రత ఉంటుందనేది ఇంకా తెలియాలి. కాబట్టి బ్యాంకులో డబ్బు దాచుకునే విషయంలో ఆందోళన వద్దు.
-
నా పేరు ప్రదీప్, హైదరాబాద్ నివాసిని. ప్రస్తుతం నేను మ్యూచువల్ ఫండ్లలో రూ. 6000 సిప్ ద్వారా మదుపు చేస్తున్నాను(రూ. 3000 కోటక్ మహీంద్రా లో, రూ. 3000 ఎల్ అండ్ టీ లో) 20 ఏళ్ళు చేద్దామనుకుంటున్నాను. చివరికి ఎంత లభిస్తుంది? సలహా ఇవ్వండి.
మ్యూచువల్ ఫండ్లలో ఎంత లభిస్తుందో ఖచ్చితంగా చెప్పలేము. కేవలం గత సంవత్సరాల రాబడి బట్టి ఒక అంచనా కి రావచ్చు. మీరు మదుపు చేసిన పధకాల పని తీరు సరి చూసుకోండి. వాటిని ప్రతి సంవత్సరం గమనిస్తూ ఉండండి.
20 ఏళ్ళ పాటు నెల నెలా రూ. 6000 సిప్ చేస్తే 12 శాతం రాబడి ప్రకారం సుమారుగా రూ. 60 లక్షలు సమకూర్చుకోవచ్చు. దీర్ఘకాలం పాటు మదుపు చేయాలనే మీ ఆలోచన సరైనదే.
-
సర్, క్రెడిట్ కార్డు తో బంగారం కొనుగోలు చేయవచ్చా? ఏదైనా చార్జీలు ఉంటాయా?
క్రెడిట్ కార్డు తో బంగారం లేదా ఏదైనా కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా, క్రెడిట్ కార్డు వాడకం పై చార్జీలు ఉండవు. మీరు ఒకసారి దుకానుదారుడితో ఈ విషయాన్ని తెలుసుకోవడం మంచిది. సకాలం లో బిల్లు ని చెల్లిస్తూ ఉండండి.
-
నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
హెచ్డీఎఫ్సీ ప్రో గ్రోత్ ప్లస్ మదుపు, బీమా హామీ కలిపి ఇచ్చే ఒక యూలిప్ పాలసీ. ఇతర యూలిప్ పాలసీల వలే ఇందులో కూడా మోర్టాలిటీ, ఫండ్ మానేజ్మెంట్, రిస్క్ బెనిఫిట్ లాంటి ఎన్నో చార్జీలు విధిస్తారు. వీటి వల్ల మదుపు చేస్తే మొత్తం తగ్గిపోతుంది, కాబట్టి రాబడి కూడా తగ్గిపోతుంది.
మీరు పాలసీని వెనక్కి ఇస్తే వచ్చే మొత్తం గురించి ఆరా తీసి కుదిరితే పాలసీ ని వెనక్కి ఇచ్చేయండి. ఇలా మిగిలిన డబ్బుని నెల నెలా సిప్ చేయండి. అలాగే మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 నుంచి 12 రెట్లు బీమా హామీ ఉండే టర్మ్ పాలసీ ని ఎంచుకోండి.
-
డియర్ సిరి, నేను ప్రభుత్వ ఉద్యోగిని. నా స్థూల ఆదాయం రూ. 36,928, నికర ఆదాయం రూ. 31,660. సీపీఎస్‌కి రూ.3288, టీఎస్జీఎల్ఐ కింద రూ.1000, పీటీ కి రూ.200, జీఐఎస్ కి రూ. 30 డిడక్ట్ అవుతున్నాయి. పీఎల్ఐ కి రూ.1000. ఎల్ఐసీకి రూ.4,600 చెల్లిస్తున్నాను. ఒక సంవత్సరం వయసు ఉన్న నా పాప కోసం రూ.1000 సుకన్య సమృద్ది యోజనలో డిపాజిట్ చేయాలనుకుంటున్నాను. నేను వడ్డీలేకుండా తీసుకున్న రుణం రూ.5.50 లక్షలు ఉంది. వ్యక్తిగత రుణం తీసుకుని నా మొత్తం రుణాలను చెల్లించాలనుకుంటున్నాను. నేను నా రుణాలను తీర్చి ఇల్లు లేదా ప్లాట్ కొనుగోలు చేసేందుకు ఏమి చేయాలి?
ప్రారంభ రోజుల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల కాపౌండ్ వడ్డీని పొందవచ్చు. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా టర్మ్ పాలసీని తీసుకోండి. మీకు 60 సంవత్సరాలు వచ్చే వరకు పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. దానికి సంబంధించిన వివిధ బీమా రైడర్లను తీసుకోండి. వ్యక్తిగత రుణాలు, బయటి రుణాలలో వడ్డీ రేట్లు 13 నుంచి 16 శాతం ఉంటాయి. అందువల్ల వాటికి దూరంగా ఉండడమే మంచిది. మీ ఖర్చులను తగ్గించుకుని నెలవారీ ఆదాయం నుంచి దఫదఫాలుగా హ్యండ్లోను చెల్లించండి.
ప్లాటుకు బదులుగా ఇంటిని కొనుగోలు చేయడం మంచిది. గృహ రుణాలు దీర్ఘకాలిక పెట్టుబడులు, ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 24బీ కింద వడ్డీని క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ డిపార్టుమెంటు నుంచి గృహ రుణం తీసుకోండి. హ్యాండ్లోను చెల్లించిన తరువాత సుకన్య సమృద్ధి యోజనకు ఎక్కువ మొత్తాన్ని కేటాయించండి.
-
సర్, నేను ఒక ప్రైవేట్ ఉద్యోగి. నేను రూ 15 లక్షల విలువ గల స్థలంపై లోన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఏ బ్యాంకు మంచి వడ్డీని ఇస్తోంది. నెలకు రూ 25 వేలు చెల్లిస్తే ఎన్ని ఏళ్లలో రుణం తీరుతుంది?
స్థలంపై రుణం ఇవ్వటానికి మార్కెట్ విలువ కన్నా , స్థానిక ప్రభుత్వ రికార్డ్ ల ప్రకారం ధరను నిర్ణయిస్తాయి . ఈ విలువలో 75 శాతం మేరకు రుణం లభించే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ వడ్డీ రేట్లు 11-12 శాతం గా ఉంటాయి. రూ 12 లక్షల రుణంపై 12 శాతం వడ్డీ పరిగణించి, నెలకు రూ 25 వేలు చెల్లించ గలిగితే 66 నెలలు (అంటే ఐదున్నర ఏళ్ళు) పడుతుంది. అదే రూ. 15 లక్షల రుణం పొందితే, రూ. 25000 నెలసరి ఈఎంఐ చొప్పున 7 ఏళ్ళ 8 నెలలు పడుతుంది.
-
నా వద్ద రూ. 5 లక్షలు ఉన్నాయి. ఇందులో నుంచి నెలసరి వడ్డీ కావాలంటే ఎందులో మదుపు చేయాలి?
మీరు ఈ మొత్తాన్ని బ్యాంకు లో ఫిక్సిడ్ డిపాజిట్ చేయవచ్చు. కాల పరిమితి, వడ్డీ మొత్తాన్ని ఎంచుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ లో నెలసరి ఆదాయ పధకం కూడా ఎంచుకోవచ్చు.
-
సర్, క్రెడిట్ కార్డు తో బంగారం కొనుగోలు చేయవచ్చా? ఏదైనా చార్జీలు ఉంటాయా?
క్రెడిట్ కార్డు తో బంగారం లేదా ఏదైనా కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా, క్రెడిట్ కార్డు వాడకం పై చార్జీలు ఉండవు. మీరు ఒకసారి దుకానుదారుడితో ఈ విషయాన్ని తెలుసుకోవడం మంచిది. సకాలం లో బిల్లు ని చెల్లిస్తూ ఉండండి.
-
మ్యూచువల్ ఫండ్లలో 2000 చొప్పున 10 ఏళ్ళ చేస్తే ఎంత మొత్తం వస్తుంది ?
మ్యూచువల్ ఫండ్లలో ఎంత రాబడి వస్తుందో ముందే కచ్చితంగా చెప్పలేము. ఇది ఫండ్ వ్యూహం, ఫండ్ మేనేజర్ పని తీరు, మార్కెట్ స్థితిగతులు లాంటి వాటి పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, ఒక ఇండెక్స్ ఫండ్ ఎంచుకుంటే సగటున 12 శాతం చొప్పున రాబడి ఆశించవచ్చు.
నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
-
నా పేరు ప్రదీప్, హైదరాబాద్ నివాసిని. ప్రస్తుతం నేను మ్యూచువల్ ఫండ్లలో రూ. 6000 సిప్ ద్వారా మదుపు చేస్తున్నాను(రూ. 3000 కోటక్ మహీంద్రా లో, రూ. 3000 ఎల్ అండ్ టీ లో) 20 ఏళ్ళు చేద్దామనుకుంటున్నాను. చివరికి ఎంత లభిస్తుంది? సలహా ఇవ్వండి.
మ్యూచువల్ ఫండ్లలో ఎంత లభిస్తుందో ఖచ్చితంగా చెప్పలేము. కేవలం గత సంవత్సరాల రాబడి బట్టి ఒక అంచనా కి రావచ్చు. మీరు మదుపు చేసిన పధకాల పని తీరు సరి చూసుకోండి. వాటిని ప్రతి సంవత్సరం గమనిస్తూ ఉండండి. 20 ఏళ్ళ పాటు నెల నెలా రూ. 6000 సిప్ చేస్తే 12 శాతం రాబడి ప్రకారం సుమారుగా రూ. 60 లక్షలు సమకూర్చుకోవచ్చు. దీర్ఘకాలం పాటు మదుపు చేయాలనే మీ ఆలోచన సరైనదే.
-
నా పేరు ప్రదీప్, నిజామాబాదు నివాసిని.నా నెలసరి జీతం రూ. 40 వేలు. గత నెలలో నేను రూ. 1.5 కోటి బీమా హామీ గల ఐసీఐసీఐ టర్మ్ పాలసీ తీసుకున్నాను,ప్రీమియం రూ. 24,064. ఇది మంచిదేనా?
మీరు ఎంచుకున్న కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ ఉత్తమమైన 3 కంపెనీల్లో ఒకటి. మీ వివరాలన్నీ సరిగ్గా ఇచ్చారని భావిస్తున్నాము. ఇలా చేయడం వాళ్ళ క్లెయిమ్ సమయం లో మీ కుటుంబానికి ఎటువంటి సమస్యలు ఉండవు. మీరు తీసుకున్న బీమా హామీ కూడా సరిపోతుంది. అలాగే ఆరోగ్య బీమా కోసం కూడా ఒక మంచి ఫ్లోటర్ పాలసీ తీసుకోండి. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్, సిగ్న టీటీకే వంటి కంపెనీల పాలసీలను పరిశీలించండి.
-
నా పేరు ప్రదీప్, నిజామాబాదు వాసిని. నేను మే 2017 నుంచి కోటక్ స్టాండర్డ్ మల్టీ కాప్, ఎల్ అండ్ టీ మిడ్ కాప్ ఫండ్ లో రూ. 3000 చొప్పున సిప్ చేస్తున్నాను. గత 6 నెలలుగా ఎల్ & టీ మిడ్ కాప్ ఫండ్ రాబడి తగ్గుతూ ఉంది. ఇందులో కొనసాగాలా లేదా మారమంటారా?
మీరు పేర్కొన్న ఫండ్లలో ఒకటి మల్టీ కాప్, ఒకటి మిడ్ కాప్ ఫండ్. ఈ రెండు ఫండ్ల పని తీరు బాగుంది, కానీ ఇవి రిస్క్ తో కూడుకున్నవి. మిడ్ కాప్ ఫండ్ లో రిస్క్ మరింత ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మార్కెట్ లో ఒడిదుడుకులు ఉన్నపుడు ఫండ్ నష్టపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీరు రిస్క్ తీసుకోగలిగితే ఈ రెండూ ఫండ్లలో కనీసం 10 ఏళ్ళు మదుపు చేయండి. లేదంటే ఒక ఐసీఐసీఐ పృ బ్లూచిప్ లాంటి ఒక లార్జ్ కాప్ ఫండ్ ని ఎంచుకోవచ్చు.
-
సర్, నేను రూ . 1.50 కోటి బీమా హామీ తో టర్మ్ పాలసీ తీసుకున్నాను. 40 ఏళ్ళ పాలసీ, ప్రీమియం రూ. 24,650. దీని బదులు ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. 10 ఏళ్లలో ఏడాదికి రూ. 54,600 కడితే చాలంటున్నారు. సలహా ఇవ్వండి.
టర్మ్ పాలసీ లో ప్రీమియం వెనక్కి ఆశించకూడదు. ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీలలో ప్రీమియం అధికంగా ఉంటుందని గమనించండి. మీరు తెలిపిన పాలసీ లో 10 ఏళ్లలో సుమారుగా రూ. 5,46,000 వరకు ప్రీమియం చెల్లించాలి. అయితే, ద్రవ్యోల్బణాన్ని దృష్టి లో పెట్టుకుని 40 ఏళ్ళకి ఈ మొత్తం సుమారుగా రూ. 11 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. మీరు ఎంచుకున్న పాలసీ కంపెనీ పేరు తెలుపలేదు. ప్రీమియం ని పాలసీ బజార్ లేక కవర్ ఫాక్స్ లో పరిశీలించారని భావిస్తున్నాము. మాక్స్ లైఫ్, ఐసీఐసీఐ పాలసీల క్లెయిమ్ సెటిల్మెంట్ బాగుంటుంది.
-
సర్ నేను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అటల్ పెన్షన్ యోజన ఖాతా ప్రారంభించాను. ఖాతాకు సంబంధించి బ్యాంకు ఎటువంటి పాస్‌బుక్ ఇవ్వలేదు. నగదు నా ఖాతా నుంచి నేరుగా ఏపీవై ఖాతాలో జమవుతుందని చెప్పారు. ఖాతాలో జమవుతుందో లేదో ఎలా తెలుసుకోవాలి. మా కుటుంబ సభ్యులు ఈ ఖాతాను నిర్వహించే అవకాశముందా?
మీరు పాన్ నంబర్, బ్యాంకు ఖాతా ఖాతా సంఖ్య ద్వారా ఈ కింద ఇచ్చిన లింక్ సాయంతో ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు. https://npslite-nsdl.com/CRAlite/EPranAPYOnloadAction.do అటల్ పెన్షన్ యోజన ఖాతాకు సంబంధించి అన్ని వివరాలు నమోదిత మొబైల్ నంబర్‌కి వస్తాయి. ఖాతాలో నగదు క్రెడిట్ అయినప్పడు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారమందుతుంది. చందాదారులు నామినీ పేరు, చిరునామా, ఫోన్‌నంబర్ వంటివి మార్చుకునే అవకాశం కూడా ఉంది. మీ ప్రాన్ నంబర్, బ్యాంకు ఖాతా సంఖ్య కుటుంబ సభ్యులకు తెలిస్తే వారు కూడా ఖాతాను నిర్వహించే అవకాశం ఉంటుంది.