ఏ కోర్సులు... ఏ సంస్థల్లో?

ఇంటర్నేషనల్ బిజినెస్: జనరల్ మేనేజ్‌మెంట్‌తోపాటు ఇంటర్నేషనల్ బిజినెస్‌పై పట్టు లభించేలా కరిక్యులమ్ ఉంటుంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దారు. బహుళజాతి కంపెనీలకు ఈ స్పెషలైజేషన్‌తో అవసరం ఉంటుంది. స్థానిక మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ ట్రెండ్ ఈ రెండింటికీ సరిపోయేలా ఉత్పత్తులను తయారు చేయడం, అభివృద్ధి పరచడం, వర్తకాన్ని విస్తరించడం, దానికి ప్రచారం కల్పించడం లాంటివన్నీ చూసుకుంటారు. అంతర్జాతీయ పరిణామాలు స్థానిక మార్కెట్‌పై ఏ విధమైన ప్రభావాన్ని చూపగలవో అంచనా వేస్తారు. ప్రధాన కార్యాలయాలు విదేశాల్లో ఉంటాయి. సాధారణంగా వీరు స్వదేశం నుంచి సేవలు అందిస్తారు. సంస్థలు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. ఈ సంస్థ ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సులో సొంత పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తుంది. దిల్లీ క్యాంపస్‌లో 220, కోల్‌కతాలో 140 సీట్లు ఉన్నాయి. ఫీజు రూ.16 లక్షలు. ఇక్కడి విద్యార్థులు సగటున రూ.20 లక్షల వార్షిక వేతనంతో క్యాంపస్ నియామకాల ద్వారా అవకాశాలు పొందుతున్నారు. సింబయాసిస్ ఇంటర్నేషనల్ బిజినెస్ (ఎస్ఐబీ), పుణే స్నాప్ ద్వారా 120 మందికి అవకాశం కల్పిస్తోంది. ఇక్కడ ఫీజు రూ.15 లక్షల వరకు ఉంటుంది. కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు సగటున రూ.10 లక్షలకు పైగా వార్షిక వేతనం పొందుతున్నారు. రూరల్ మేనేజ్మెంట్: ప్రాంతీయ సహకార సంఘాలు, అభివృద్ధి సంస్థలు, ఎన్జీవోలు, ఫండింగ్ సంస్థలు, ఫౌండేషన్లలో ఈ కోర్సులు చదివినవారికి అవకాశాలు ఉంటాయి. జాతీయ సంస్థలతోపాటు బహుళజాతి సంస్థలు సైతం గ్రామీణాభివృద్ధిలో పాలు పంచుకుంటున్నాయి. ప్రస్తుతం చాలావరకు కార్పొరేట్ కంపెనీలు సీఎస్ఆర్లో భాగంగా పెద్దఎత్తున గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నాయి. స్థానిక వనరులను అభివృద్ధి చేయడం, ఉత్పత్తులను మార్కెట్ చేయడంపైనా కృషి జరుగుతోంది. డెయిరీ, ఎరువులు, క్రిమిసంహారకాలు, వ్యవసాయ ఉత్పత్తులు...తదితర సంస్థల్లో పెద్ద ఎత్తున అవకాశాలు లభిస్తాయి. సంస్థలు: ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ (ఐఆర్ఎంఏ), ఆనంద్ (గుజరాత్), 180 సీట్లు ఉన్నాయి. క్యాట్ లేదా సొంతంగా నిర్వహించే పరీక్ష ఈ రెండింటితోనూ ప్రవేశం లభిస్తుంది. జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, భువనేశ్వర్, వెల్లింగ్కర్, ముంబయి, అమిటీ, నోయిడా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్), హైదరాబాద్ పీజీ డిప్లొమా ఇన్ రూరల్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కోర్సులు అందిస్తోంది. దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 8.. అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్: దాదాపు రూరల్ మేనేజ్మెంట్ కోర్సుగానే ఉంటుంది. అయితే వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టితో రూపొందించారు. ఇందులో చేరిన ఐఐఎం విద్యార్థులు అగ్రికల్చర్ విభాగంతోపాటు సాధారణ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లు పొందుతున్న అవకాశాలూ సొంతం చేసుకుంటున్నారు. సంస్థలు: ఐఐఎం - అహ్మదాబాద్, లఖ్‌నవూ; మేనేజ్, హైదరాబాద్, ఎస్ఐఐబీ, పుణే. ఎస్వీ అగ్రికల్చరల్ కాలేజ్, తిరుపతి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్, బెంగళూరు -అగ్రి బిజినెస్ అండ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ (ఏబీపీఎం), ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ (ఎఫ్పీబీఎం) కోర్సు అందిస్తోంది. నేషనల్ అకాడెమీ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ మేనేజ్మెంట్ (నార్మ్), హైదరాబాద్ పీజీ డిప్లొమా ఇన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇన్ అగ్రికల్చర్ పేరుతో ఏడాది వ్యవధి కోర్సు అందిస్తోంది.దరఖాస్తులకు గడువు ఫిబ్రవరి 28. . రిటైల్ మేనేజ్మెంట్: ఇప్పుడు అంతా రిటైల్ వ్యాపారమే. దుస్తులైనా, సరకులైనా కార్పొరేట్ రిటైల్ కంపెనీల్లో కొనుగోలు చేసుకోవచ్చు. రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్, ఐటీసీ, ఆదిత్య బిర్లా, టాటా, లైఫ్‌స్టైల్, స్పెన్సర్స్, డీమార్ట్, వాల్‌మార్ట్...ల్లో అవకాశాలు లభిస్తున్నాయి. సంస్థలు: నార్సీ మోంజీ (ముంబయి), వెలింగ్కర్ (ముంబయి), బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (గ్రేటర్ నోయిడా), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ (లఖ్‌నవూ), ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ) ఎంబీఏ (రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెండైజ్) కోర్సు అందిస్తోంది. దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 20.
|
మరికొన్ని...
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ (ఐఐఎఫ్ఎం), భోపాల్ రెసిడెన్షియల్ విధానంలో పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫారెస్ట్రీ మేనేజ్మెంట్ కోర్సు అందిస్తోంది. ఈ రెండేళ్ల కోర్సులో కన్జర్వేషన్ అండ్ లైవ్లీ హుడ్, డెవలప్మెంట్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్లు సైతం ఉన్నాయి. ఈ కోర్సులో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. క్యాట్/ ఎక్స్‌ఏటీ స్కోర్‌తో ఫిబ్రవరి 20లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. * నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ (ఎన్ఐటీఐఈ), ముంబయి పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కోర్సులు అందిస్తోంది. బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులు అర్హులు. ఈ సంస్థలో చదివినవారు మంచి వేతనాలతో ఉద్యోగాలు పొందుతున్నారు. * వైఎస్ఆర్ నిథమ్, హైదరాబాద్‌తోపాటు పలు సంస్థలు హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో పీజీ కోర్సులు అందిస్తున్నాయి. వీరికి హోటళ్లు, రిసార్టులు, పర్యాటక కేంద్రాలు, ఎయిర్ లైన్స్...తదితర చోట్ల అవకాశాలు లబిస్తాయి. * రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, అమేథీ ఎంబీఏ ఎనర్జీ మేనేజ్మెంట్ కోర్సును అందిస్తోంది.
|