ప్రభుత్వ ఉద్యోగాలు
బీఈసీఐఎల్, నోయిడా
భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* స్కిల్డ్, అన్‌స్కిల్డ్ మ్యాన్‌పవర్
మొత్తం ఖాళీలు: 3895 అర్హత: ఐటీఐ(ఎలక్ట్రికల్ ట్రేడ్) ఉత్తీర్ణత, అనుభవం. వయసు: స్కిల్డ్ 18-45 ఏళ్లు, అన్‌స్కిల్డ్ 18-55 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్లైన్/ ఆఫ్‌లైన్. చివరితేది: నవంబరు 18. చిరునామా: బీఈసీఐఎల్ భవన్, సీ-56/ఏ-17, సెక్టర్-62, నోయిడా-201307.
https://www.becil.com/
|
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* డిప్యూటీ ఇంజినీర్
మొత్తం ఖాళీలు: 10 విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆర్కిటెక్ట్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఆర్క్ ఉత్తీర్ణత. వయసు: 01.11.2019 నాటికి 26 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్లైన్/ ఆఫ్‌లైన్. చివరితేది: నవంబరు 30. చిరునామా: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్), జలహళ్లి పోస్ట్, బెంగళూరు-560013.
వెబ్సైట్: http://www.belnindia.in/
|
సీఐఎమ్ఎఫ్ఆర్లో సైంటిస్ట్
ధన్‌బాద్ (ఝార్ఖండ్)లోని సీఎస్ఐఆర్-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రిసెర్చ్(సీఐఎమ్ఎఫ్ఆర్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* సైంటిస్టు
మొత్తం ఖాళీలు: 11 విభాగాలు: మైనింగ్, కెమికల్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జియాలజీ, జియో ఫిజిక్స్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్. అర్హత: సంబంధిత విభాగాల్లో ఎంఈ/ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ఫీజు: జనరల్ కేటగిరి- రూ.100/-, ఎస్సీ/ ఎస్టీ/ వికలాంగులు/ మహిళలకు ఫీజు మినహాయింపు. చివరితేది: నవంబరు 18.
http://cimfr.nic.in/
|
ఏఐఏటీఎస్ఎల్లో ఆఫీసర్ పోస్టులు

ఎయిర్ ఇండియా సబ్సిడరీ సంస్థ అయిన ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏటీఎస్ఎల్) కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 168 పోస్టులు: డ్యూటీ ఆఫీసర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్(ఫైనాన్స్), ఆఫీసర్, కస్టమర్ ఏజెంట్, తదితరాలు. అర్హత: పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఐసీఏ/ ఐసీఎంఏ, ఎంబీఏ ఉత్తీర్ణత, అనుభవం. వాక్ఇన్ తేది: నవంబరు 16, 25, 26, 27, 29, 30. వేదిక: కోల్‌కతా, పోర్ట్‌బ్లెయిర్, చెన్నై, న్యూదిల్లీ, ముంబయిలోని సంబంధిత కార్యాలయాల్లో వెబ్సైట్: http://www.airindia.com/
|
ఎస్సీటీఐఎంఎస్టీ, తిరువనంతపురం
తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ & టెక్నాలజీ(ఎస్సీటీఐఎంఎస్టీ) కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 19 పోస్టులు: టెక్నీషియన్, అప్రెంటిస్, టెక్నికల్ అసిస్టెంట్ అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడు/ సబ్జెక్టులో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం. వాక్ఇన్ తేది: నవంబరు 16, 18, 19. వేదిక: నాలుగో అంతస్తు, అచ్యుతా మీనన్ సెంటర్ ఫర్ హెల్త్ సైన్స్ స్టడీస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, మెడికల్ కాలేజ్ క్యాంపస్, తిరువనంతపురం.
వెబ్సైట్: https://www./sctimst.ac.in/
|
ఏఆర్‌సీఐ, హైదరాబాద్
భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ సెంటర్ ఫర్ ఫౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్(ఏఆర్‌సీఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 10 పోస్టులు-ఖాళీలు: జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్)-09, సీనియర్ రిసెర్చ్ ఫెలో(ఎస్ఆర్ఎఫ్)-01. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంటెక్/ ఎంఈ/ ఎంఎస్ ఉత్తీర్ణత, పరిశోధన అనుభవం. వయసు: జేఆర్ఎఫ్-28 ఏళ్లు, ఎస్ఆర్ఎఫ్-32 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూతేది: నవంబరు 29. వేదిక: ఏఆర్‌సీఐ, ఆర్సీఐ - బాలాపూర్ ఎయిర్పోర్ట్ రోడ్, హైదరాబాద్-500005, తెలంగాణ. ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: నవంబరు 22. వెబ్సైట్: https://arci.res.in/
|