ప్రభుత్వ ఉద్యోగాలు
సీఐఎస్ఎఫ్లో 300 హెడ్ కానిస్టేబుళ్లు
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) స్పోర్ట్స్ కోటా ద్వారా కింది పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
* హెడ్ కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) మొత్తం ఖాళీలు: 300
క్రీడాంశాలు: అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, జిమ్నాస్టిక్స్, ఫుట్‌బాల్, హాకీ, హ్యాండ్‌బాల్, కబడ్డీ, షూటింగ్, స్విమ్మింగ్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, తైక్వాండో. అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, సంబంధిత క్రీడలో రాష్ట్ర/ జాతీయ/ అంతర్జాతీయ గుర్తింపు, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 01.08.2019 నాటికి 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: ట్రయల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, మెరిట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
చివరితేది: డిసెంబరు 17. https://www.cisf.gov.in/
|