
* ఇంటర్మీడియట్ (ఎంపీసీ) పూర్తిచేశాను. ఆర్కియాలజీ కోర్సు చదవాలనుంది. నాకు అర్హత ఉందా? కోర్సులు అందించే సంస్థల వివరాలు తెలియజేయండి.
- రాములు గంగాల
ఏదేని గ్రూపు వారు అర్హులు. బీఏ హిస్టరీ, ఆర్కియాలజీ డిగ్రీని అభ్యసించడం ద్వారా ఈ రంగంలో స్థిరపడవచ్చు. ఈ కోర్సులో ఆర్కియాలజీతో పాటుగా ఫొటో హిస్టరీ, ఆర్ట్, మ్యూజియాలజీ, ఆర్కియోమెటరీ లాంటి సబ్జెక్టులను విద్యార్థులు చదవాల్సి ఉంటుంది. గొప్ప పరిశీలన, గ్రహణ శక్తి, విశ్లేషణాత్మక- తార్కిక నైపుణ్యాలను విద్యార్థి ఇనుమడింపచేసుకోవాలి. యూనివర్సిటీ ఆఫ్ కేరళ, డిపార్ట్మెంట్ ఆఫ్ మను స్క్రిప్ట్లాజీ-తమిళ్ యూనివర్సిటీ, సెంటర్ ఫర్ మ్యూజియాలజీ అండ్ కన్జర్వేషన్- యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ - దిల్లీ ఈ కోర్సును అందిస్తున్నాయి.
|
ఆస్ట్రో ఫిజిక్స్ ఎలా?

* పదో తరగతి చదువుతున్నాను. ఆస్ట్రో ఫిజిక్స్ చదవాలనుంది. ఇంటర్లో ఏ గ్రూపును ఎంచుకోవాలి? ఏ ప్రవేశ పరీక్షలు రాయాలి?
- కె. ప్రేమ్ సాయి, అచ్చంపేట
ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివినవారు ఆస్ట్రోఫిజిక్స్ కోర్సు చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. డిగ్రీ స్థాయిలో బీఎస్సీ (ఎంపీసీ) లేదా బీటెక్ కోర్సును పూర్తిచేసినవారు ఆస్ట్రోఫిజిక్స్లో ఎంఎస్సీ కోర్సును చేయవచ్చు. దీన్ని మనదేశంలో ఎక్కువ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో అందిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, పంజాబీ యూనివర్సిటీ, ఐఐఎస్సీ ఆలిగర్ ముస్లిం యూనివర్సిటీ లాంటివి ఆస్ట్రోఫిజిక్స్లో ఎంఎస్సీని అందిస్తున్నాయి. JEST పరీక్ష ద్వారా ఐఐఏ, ఐయూసీఏఏ, టీఐఎఫ్ఆర్ లాంటి సంస్థల్లో పీహెచ్డీ ప్రవేశాన్ని పొందవచ్చు. ఎంఎస్సీ కోర్సులో ప్రవేశాలకు పైన పేర్కొన్న విశ్వవిద్యాలయాలు సొంత ప్రవేశ పరీక్షల ద్వారా ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి.
|