close

తాజా వార్తలు

హాలీవుడ్‌ రీమేక్‌లో దీపిక

ముంబయి: ‘ఛపాక్‌’ విజయంతో మంచి ఫామ్‌లో ఉన్న బాలీవుడ్‌ అగ్ర నటి దీపిక పదుకొణె తన తర్వాతి సినిమాను ప్రకటించింది. బాలీవుడ్‌ నటులు చాలామంది రీమేక్‌లవైపు చూస్తుంటే ఈ ముద్దుగుమ్మ మాత్రం ఏకంగా హాలీవుడ్‌ సినిమాపై కన్నేసింది. హాలీవుడ్‌లో అన్నే హతావే, రాబర్ట్‌ డి నీరో నటించిన ‘ది ఇంటర్న్‌’ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేయనున్నారు. ఈ సినిమాలో సీనియర్‌ నటుడు రిషీ కపూర్‌తో పాటు దీపిక నటించనుంది. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి వీరిద్దరూ చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో చేయనుండటంతో వారి ఆనందాన్ని ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటి వరకూ వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారని వచ్చిన గాసిప్స్‌ను ఈ ప్రకటనతో నిజం చేశారు.
‘ఈ సినిమాలో నటించటం ఎంతో థ్రిల్‌గా ఉంది. అన్నీ అనకున్నట్లు జరిగితే 2021లో విడుదల చేస్తాం’ అని ఆమె తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. కాగా. హాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించిన ఈ సినిమాను ఇప్పుడు హిందీలో తీయనుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో దీపిక ‘బాస్‌ లేడీ’గా కనిపించనుంది. మరోవైపు దీపికా తన భర్త రణవీర్‌ సింగ్‌తో కలిసి ‘83’లో నటిస్తోంది. 

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.