‘ప్రాణం పోయినా వదిలిపెట్టను’ అంటోన్న యశ్‌ - Yash Gajakesari Telugu Teaser released
close
Updated : 26/02/2021 20:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ప్రాణం పోయినా వదిలిపెట్టను’ అంటోన్న యశ్‌

ఇంటర్నెట్‌ డెస్క్: ‘కె.జి.యఫ్‌’ కథానాయకుడు యశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘గజకేసరి’. కన్నడ చారిత్రక యాక్షన్ చిత్ర నేపథ్యంగా వచ్చిన ఈ సినిమాకి యస్.కృష్ణ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి తెలుగు టీజర్‌ని విడుదల చేశారు. ‘‘ప్రాణం పోయినా నన్ను నమ్ముకున్నవారి చేయి వదిలిపెట్టను’’ అంటూ యశ్‌ చెప్పే డైలాగ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

‘‘ప్రతి తల్లీ కోరుకునే బిడ్డ...ప్రతి రాజు గర్వపడే సేనాధిపతి..మన గజకేసరి’’, ‘‘శ్రీలంక నుంచి వచ్చానంటే మామూలు రాక్షసుడిని అనుకున్నావా.. కాదు పదితలల రావణుడుని..’’ అంటూ సాగే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అమూల్య కథానాయికగా నటించింది. ‘కాలకేయ’ ప్రభాకర్‌, అనంత్‌ నాగ్‌, గిరిజా లోకేష్‌, మాండ్య రమేష్‌, జాన్‌ విజయ్‌ తదితరులు నటిస్తున్నారు.

ఐకాన్‌ స్పేస్‌, సల్ల కుమార్‌ యాదవ్‌ సమర్పణలో వచ్చిన ఈ సినిమాని శ్రీ వేదాక్షర మూవీస్‌, కలర్స్ అండ్‌ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. రామారావు చింతపల్లి, ఎం.ఎస్‌.రెడ్డి చిత్రాన్ని మార్చి 5, 2021న తెలుగులో విడుదల చేస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని